Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Friday, July 3, 2026

జూన్ వేతనము అందక ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు

ఎడిటర్ కె నరేష్ కుమార్9848025451

 తక్షణమే వేతనం చెల్లించాలి- రామ రాజేష్ ఖన్నా డిమాండ్

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): జూన్  నెల పెండింగ్ వేతనం  వెంటనే చెల్లించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  మీడియ సమావేశంలో రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 వేల మందికి పైగా ఇందులో పనిచేస్తున్నారని వారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేశారని వారందరినీ బేషరతుగా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాలలో రెగ్యునరైజ్ చేశారు రెగ్యులరైజ్ చేసిన రాష్ట్రాల పేర్లు హిమాచల్, ప్రదేశ్, మణిపూర్, పంజాబ్ కావున తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.  సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలతో చికితి పోతున్నాయని వాపోయారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ అది అమల్లోకి రాలేదు.. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన వేతనాలు పడలే అంటే చూడండి.. ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు చెప్పాలి సీఎం కంటే పెద్దవారు ఎవరున్నారు మన రాష్ట్రంలో... కొంచెం మీడియా ద్వారా మా సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లండి మీడియా తరఫున కోరుతున్నాం. ప్రతి నెల 1 వ తేదీన వేతనాలు ఇప్పించవలసిందిగా ఉద్యోగులందరి పక్షాన కోరుతున్నాను. అసలే పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలు సకాలంలో జీతాలు అందక, కుటుంబ పోషణ, స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లులు, పాఠ్య పుస్తకాలు, ఇంటి అద్దె, బస్ చార్జీలకు డబ్బుల్లేక పూట గడిచేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవతా ధృక్పథంతో స్పందించి సకాలంలో ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా విజ్ఞప్తి చేశారు.

Bottom Ad Space

Veda Software Ad