Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Sunday, June 28, 2026

నిండు జీవితానికి రెండు చుక్కలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నిండు జీవితానికి రెండు చుక్కలు

కేవలం రెండు చుక్కలు జీవితాంతం పోలియో నుంచి రక్షణ

- డాక్టర్ చేవూరు చిన్న 

కావలి,(ఆరోగ్యజ్యోతి):పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని కొనసాగించడానికి భవిష్యత్తులో వైకల్యం రాకుండా నివారించడానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించాలని ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న అన్నారు. ఆదివారం దళితవాడ అంగన్‌వాడీ కేంద్రం బూత్‌ ల ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా డాక్టర్ చేవూరు చిన్న మాట్లాడుతూ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకో లేకపోయిన పిల్లలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది జూన్ 29,30 తేదీల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించి,చుక్కలు వేయనున్నారని, ప్రతి చిన్నారికి పోలియో రాకుండా పోలియో నిర్మూలన చుక్కలు వేయించాలని ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన కుటుంబం,మన సమాజం యొక్క భవిష్యత్తు అని డాక్టర్ చేవూరు చిన్న అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ యన్ యం. యం.రేవతి,ఆశా వర్కర్ సిహెచ్ సౌజన్య,అంగన్వాడి వర్కర్స్ కె.విజయలత సిహెచ్.విజయ్ కుమారి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

Bottom Ad Space

Veda Software Ad