Sports & Games

Breaking News

మే నెల జీతం మరియు 7 నెలల పి.ఆర్.సి. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. హెచ్.ఎం) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా  ప్రతి నెల వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉద్యోగులు పడుతున్నారని  ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్  ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సుమారు 17 వేల మంది  ఉద్యోగులు  పొరుగు సేవల (కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) విధానంలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. 78 విభాగాల్లో వీరు సేవలందిస్తున్నారు. కానీ వీరికి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని  ముఖ్యమైన సమస్యలు  అనగా మే  నెలల వేతనము మరియు ఏడు నెలల పి.ఆర్.సి. ఏరియర్స్   తక్షణమే చెల్లించాలని, ప్రతి నెలా 1వ తేదీ నే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల తొమ్మిదిన సర్కులర్ జారీ చేశారని రామ రాజేష్ అన్న పేర్కొన్నారు. అది సర్కులర్ ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం కోరుతున్నాం.. ముఖ్యంగా ఇంటి పోషణ అనగా  పిల్లల బడి ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లు, పాఠ్య పుస్తకాలు , ఇంటి అద్దె ,  లేక ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తున్నారని ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కావున వెంటనే సమస్య పరిష్కరించి వేతనాము మరియు ఎరియర్స్ చెల్లించాలని..