రక్తదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్ కాలనీకి చెందిన పద్మ రక్తదానం చేయడంలో ముందున్నారు. రక్తం ఎవరికైనా అవసరం ఉందంటే వెంటనే ఆమె స్పందించి రక్తదానం చేస్తారు ఒకవేళ రక్తదానం చేసేందుకు వీలు కానట్లయితే ఇతరులచే రక్తదానం చేయిస్తారు పద్మ. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో పద్మ రక్తదానం చేశారు. సందర్భంగా పద్మ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు రక్తదానం కేవలం మగవారు మాత్రమే చేయాలని ఏమీ లేదని మహిళలు కూడా ముందుకు వచ్చే స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత రక్తం తగ్గుతుంది అనే అపోహాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. తాను ఇప్పటివరకు ఐదు సార్ల రక్తదానం చేశానని తెలిపారు రాయబోయే రోజుల్లో కూడా రక్తదానం చేసేందుకు ముందు ఉంటానని తెలిపారు. మహిళల్లో రక్తదానంపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదని కానీ రక్తదానం చేసేందుకు మహిళలు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.