*ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడి
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి ):రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో,మెడికల్ కాలేజీలలో, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ,శానిటేషన్, పేషంట్ కేర్,స్వీపర్ ఇతర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కోటి డిఎంఈ కార్యాలయం ముందు ధర్నా జరిగింది, ఈ ధర్నాను ఉద్దేశించి యాద నాయక్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వైద్య విద్య సంచాలకులు గారికి, కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ గారికి ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 20 రోజులలో వేతనాల పెంపు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 20 రోజులు లోపు వేతనాలు పెంచకపోతే దశల వారి ఆందోళన పోరాటాలు అవసరమైతే నిరవధిక సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ పిలుపునిచ్చారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జె సుధాకర్, రమేష్, ప్రకాష్, దేవిదాస్, సుమన్,కర్ణాకర్,రాజు, కుమారస్వామి, విజయ సదానందం రమేష్ తిరుపతి, మైపాల్, జంపయ్య మనోహర్ తదితరులు పాల్గొన్నారు