Sports & Games

Breaking News

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వండి

*బస్తి దావఖాన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులివ్వాలి.*

ఐదు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలి*
*హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో సుమారు 500 బస్తి దావఖాన లో పనిచేస్తున్న వైద్యాధికారి , నర్సింగ్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ సుమారు తెలంగాణ రాష్ట్రంలో 1500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్  (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరుచున్నారు.. 5 నెలల పాటు పెండింగ్ లో ఉన్న బస్తి దావఖాన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలని  సోమవారం రోజున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము... ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ..  కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో అతి తక్కువ వేతనాలతో  పనిచేస్తున్న  బస్తి దావఖన ఉద్యోగులని తెలియజేశారు. రోజురోజుకు  పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీతాలు సరిపోక, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారని జీవితం కొన సాగిస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుత కండిషన్ లో అప్పు పుట్టట్లేదు ఉద్యోగులకు కావున ప్రభుత్వం వెంటనే వీరికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. ఏటా ఏప్రిల్ లో ప్రభుత్వం కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 2025లో ఇంతవరకూ ఉత్తర్వులు రాకపోవడం పోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని రామ రాజేష్  ఖన్నా తెలిపారు. నెలల తరబడి వేతన బకాయిలు పెండింగ్లో ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ... ప్రజాపాలన సజా వుగా సాగడంలో బస్తి దావఖన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కీలకమైన కొనియాడారు ఈ నేపథ్యంలో బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, వెంటనే కొనసాగింపు (కంటిన్యూయేషన్) ఉత్తర్వులను జారీ చేసే ఉద్యోగులకు రావలసిన బకాయి ఐదు నెలల వేతనాలు  విడుదల చేయాలని,తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు..