Sports & Games

Breaking News

దోమల నివారణకు మున్సిపల్ లో ప్రత్యేక కార్యచరణ

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

డెంగ్యూ నియంత్రణపై "అర్బన్ యాక్షన్ ప్లాన్" 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో డెంగ్యూ నియంత్రణ చర్యలు చేపట్టడానికి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు ప్రత్యేకంగా "అర్బన్ యాక్షన్ ప్లాన్" రూపొందించబడించారు. ఈ కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ , డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సాధన , జిల్లా మలేరియా నివారణ అధికారి డా. శ్రీధర్ మెట్పల్లి వార్, జిల్లా మెప్మా కోఆర్డినేటర్ శ్రీనివాస్, టీఎంసీ ప్రతినిధి భాగ్యలక్ష్మి, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు శంకర్ మరియు నరేందర్, అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యాధికారులు, సానిటరీ జవాన్లు, సూపర్వైజర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, మరియు ఏఎన్ఎమ్‌లు పాల్గొన్నారు.అర్బన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం, మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 49 వార్డులను ఆరు టీములుగా విభజించారు. ప్రతి టీంలో మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, మరియు మెప్మా సిబ్బంది ఉంటారు. వారానికి మూడుసార్లు—అంటే మంగళవారం, గురువారం, శుక్రవారం—తమకు కేటాయించిన వార్డుల్లో డ్రైడే, ఆంటీ లార్వా యాక్టివిటీస్, మరియు డెంగ్యూ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి 15 రోజులకు మొత్తం 49 వార్డులలో కార్యకలాపాలు పూర్తవుతాయి.ఈ అర్బన్ యాక్షన్ ప్లాన్ ను రేపటి నుండి అధికారికంగా అమలు చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.