ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ర్యాలీ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవ ర్యాలీ
మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నినాదం "ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అంతరం"అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఇది కేవలం మాతృత్వ సంబంధిత ఆరోగ్యానికి కాకుండా కుటుంబ సంక్షేమానికి కూడా అవసరం అన్నారు ప్రతి తల్లి మీ శరీరము, మనసు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే తల్లి కావాలని ఆయన తెలియజేశారు అదే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించిన వివాహ వయసు ఆడబిడ్డకు 21 సంవత్సరంలు, మగ బిడ్డకు 25 సంవత్సరములు అని పేర్కొన్నారు తగిన వయసు వచ్చిన తర్వాత వివాహం చేయుట ద్వారా బాల్యవివాహాలను నివారించవచ్చు అన్నారు "తల్లి కావడానికి సరైన వయసు ప్రకారం శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచిది "అని తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులుగా మారే ముందు ఇది పిల్లల కనటానికి సరైన సమయం అవునా? కాదా? అని దంపతులు వైద్య సిబ్బంది సలహా తీసుకోవటం అవసరం అని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు