ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తల్లాడ,(ఆరోగ్యజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాలలో ఆరోగ్య శిబిరంలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఐ రత్న మనోహర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. తల్లాడ మల్లారం అన్నారుగూడెం వెంకటాపురం కిష్టాపురం బంజరాయి నూతనకల్ కేశపురం కుర్నవల్లి గ్రామాలలో ఆరోగ్య శిబిరంలు నిర్వహించటం జరిగినది. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలకు ఈ వర్షాకాలంలో నీటి నిల్వల వల్ల దోమల యొక్క అభివృద్ధి పెరిగి జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మన ఇంటి పరిసరాలలో పాత టైర్లు ,కుండలు, జాడీలు ,రోళ్ళు,కూలర్లు మొదలైన వారిలో వర్షం నీరు చేరి దోమలు అభివృద్ధి పెరిగితే జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కావున మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.ఈ వైద్య శిబిరాలలో డాక్టర్s శ్రీకాంత్ గోపి మహేష్ నిష్మ విజయ్, సూపర్వైజర్ s పెద్ద పుల్లయ్య, భద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీ, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.