Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Sunday, June 28, 2026

*పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్* 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):భావితరాల ఆరోగ్య భద్రత కోసం, పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని *రత్న సాన్వి వెల్ఫేర్ సోసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు* పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నేరడిగొండ మండలం  వాంకిడిలోని జడ్పి ఎస్ ఎస్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని  సందర్శించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాన్నిఉద్దేశించి అయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ మానస, బంధం రెగడి అంగన్వాడీ టీచర్ తూర్పు బాయి, సొసైటీ సభ్యులు ఓం కుమార్ గ్రామస్తులు ఇందల్ సింగ్, కైలాష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bottom Ad Space

Veda Software Ad