Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Thursday, June 25, 2026

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారీ డాక్టర్.బీ సాంబశివరావు*

వరంగల్ ,(ఆరోగ్యం):ఎస్.ఆర్.ఆర్.తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సేవల పర్యవేక్షణ, నూతన భవన నిర్మాణ పనుల పరిశీలనజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి. సాంబశివరావు గురువారం అక్కడ అందిస్తున్న వైద్య సేవలు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు.ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, వైద్య రికార్డులు, ఔషధాల లభ్యత, మాతా - శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, యూ-విన్, ఎన్.సి.డీ, టీకా కార్యక్రమం తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు పలు సూచనలు అందించారు.అనంతరం యూ.పీ.హెచ్‌.సీ ఎస్.ఆర్.ఆర్.తోటకు నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్.బి. సాంబశివరావు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.అనిత,  అకౌంటెంట్ శ్వేత, రామ రాజేష్ ఖన్నా  ఉన్నారు..

Bottom Ad Space

Veda Software Ad