హెచ్ఐవి గురించి చర్చిద్దాం - హెచ్ఐవి ని నివారిద్దాం
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
పల్నాడు (ఆరోగ్యజ్యోతి)హెచ్ఐవి గురించి చర్చిద్దాం హెచ్ఐవి ని వారిద్దాం అని మన భావి తరాలు హెచ్ఐవి బారిన పడకుండా రక్షించుకోవాలంటే, మరొకసారి హెచ్ఐవి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మరియు చర్చించటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నరసరావుపేట లోని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వాహనం ప్రొజెక్టర్ ద్వారా హెచ్ఐవి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి చెందే పద్ధతి, హెచ్ఐవి వ్యాప్తి నివారణ చర్యలు వివరించారు. హెచ్ఐవి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రచురించిన కరపత్రములు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్త అనుపమ టిబి సూపర్వైజర్ సౌజన్య, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎల్ నాగలక్ష్మి, కె ఈశ్వర్, ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.