Sports & Games

Breaking News

పోలీసు మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి పోలీసు కమీషనర్: సన్ ప్రీత్సింగ్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక వైద్య పరీక్షల కోసం రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పోలీసు కమీషనర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్ ప్రీత్సింగ్ మాట్లాడుతూ నిరంతరం శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళకు గురి అవుతుంటారని అన్నారు. నిత్యం వ్యాయామం, వాకింగ్, యోగా లాంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఒత్తిళ్ళను అధిగమిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. పోలీసుల వారి కుటుంబాల ఆరోగ్య సంక్షేమానికి పోలీసు శాఖ ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. ఈస్ట్ జోన్ డి.సి.పి. అంకిత్ కుమార్ మాట్లాడుతూ తరచూ ఇలాంటి వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. మెడికవర్ హాస్పిటల్, భగీరథ్ కార్డియాక్్కర్ మెఘన మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్, కొరివి నవీన్ అడ్వాన్స్ న్యూరోకేర్ హాసుపత్రులు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిభిరంలో న్యూరోలాజి వైద్యులు డా॥ కొరివి నవీన్, డా॥ ప్రియాంక, కార్డియాలజిస్ట్ డా॥సంతోష్ మధాని, గ్యాస్ట్రో వైద్యులు వెంకటేశ్వర్లు లతో పాటు కంటి వైద్యులు, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ ప్రత్యేక వైద్యులు శుక్రవారం రోజు సుమారు 900 మందికి అవసరమైన వైద్య చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డి.సి.పి.లు యం. సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఎ.సి.పి.లు జానీ నర్సింహులు, సురేందర్, జితేందర్ రెడ్డి, డేవిడ్రాజ్, నాగన్న, అనంతయ్య లతో పాటు పలు పోలీసు అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డా॥ అల్లం అప్పయ్య, హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఇంచార్జి ఫార్మసీ అధికారి ఉప్పు భాస్కర్ రావు లు పాల్గొన్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ద్వారా సుమారు 5లక్షల విలువైన మందులను ఈ శిభిరం కోసం అందించినట్టు డా|| అప్పయ్య, ఉప్పు భాస్కర్ రావు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమ్రత, హరినాథ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.