Sports & Games

Breaking News

గ్రీన్ చట్నీతో అందం ఆరోగ్యం మీ సొంతం

గ్రీన్ చట్నీతో అందం ఆరోగ్యం మీ సొంతం గ్రీన్ చట్నీలో విటమిన్ మినరల్స్ ఎన్నో ఇది వాడడం వల్ల శరీరానికి ఎనర్జీ జబ్బులు దూరం వ్యాసకర్త శిరీష అందిస్తున్న ప్రత్యేక వ్యాసం తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):స్పెషల్
చట్నీ అనేది సాధారణంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి ఆకులతో తయారుచేసే చట్నీ, దీనిలో కొన్ని ప్రత్యేక పదార్థాలు కలుపుతారు, దీని వలన రుచి, సువాసన మరియు ఆరోగ్య లాభాలు ఎక్కువవుతాయి. స్పెషల్ గ్రీన్ చట్నీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో వాడే ఇందులో వాడే ప్రతి వస్తువుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు ఒకవైపు రుచి కమ్మటి గుమగుమలాడే వాసన తో పాటు మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం మెగ్నీషియం జింక్ తో పాటు తదితర వాటినే అందిస్తుందని వ్యాసకర్త శిరీష తెలిపారు. వారానికి ఒకటి రెండు సార్లు స్పెషల్ గ్రీన్ చట్నీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని శిరీష వివరించారు.. పుదీనా లో.. విటమిన్ ఏ, మరియు సి, మినరల్స్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్ ఉంటుంది. పుదీనా వల్ల జీర్ణక్రియకు సహాయం చేస్తుంది నోటి వాసన తగ్గిస్తుంది చెల్లదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరలో… విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఏ, బి, టు బి 6, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.. జీర్ణశక్తి పెంపు ఆరోగ్యం రక్తంలో చక్కెర నియంత్రణ గుండె ఆరోగ్యం మూత్ర సంబంధిత సమస్యలు జలుబు దగ్గు వీటిని కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది కొత్తిమీర.. గోధుమ గడ్డి లో… విటమిన్ ఏ&సి, ఈ, కే, బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఉంటుంది. సుమారు 17 రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి. శరీరానికి పనిచేయడంలో కీలకపాత్ర వహిస్తున్న పీరోపిల్ ఇందులో ఉంటుంది. రక్త శుద్ధి చేయడం ఈమిన్ సిస్టంను బలపరుస్తుంది జీర్ణవ్యవస్థకు సహాయం చేస్తుంది చర్మానికి క్రాంతినిస్తుంది బరువు తగ్గటానికి సహకరిస్తుంది రక్తహీనత నివారిస్తుంది ఆలయాన్ని శుభ్రం చేస్తుంది.. మునగాకులో… పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపుకు మంచి చేసే విటమిన్ ఏ, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, చర్మం జుట్టుకు ఉపయోగపడే విటమిన్ ఈ, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం మెరుస్తుంది ముడతలు తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది రక్తహీనత తగ్గిస్తుంది షుగర్ ని నియంత్రణలో సహాయపడుతుంది ఎముకలను బలంగా ఉంచుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ లో సహాయం చేస్తుంది. జుట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చి.. ఇది మన అందరికీ తెలిసింది ఇందులో విటమిన్ సి మరియు ఏ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది.. పచ్చిమిర్చి వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ క్రియ మెరుగుదల రక్తప్రసరణ మెరుగుపరచడం బరువు తగ్గడంలో సహాయం హృదయ ఆరోగ్యం కాపాడుతుంది తలనొప్పి సైనస్ సమస్యలను ఉపశమనం చేస్తుంది.. వెల్లుల్లి: వెల్లుల్లి వాడటం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి రక్తపోటు నియంత్రణ కొలెస్ట్రాల్ తగ్గించడం గుండె సంబంధిత వ్యాధులు రోగనిరోధక శక్తి పెరుగుదల జలుబు దగ్గు తగ్గింపు లాంటి ఉన్నవి. టమాటో.. టమాటాలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, పొటాషియం, విటమిన్ బి 9, యాంటీ ఆక్సిడెంట్లు తదితర విటమిన్స్ ఉంటాయి. ఇవి వాడడం వల్ల కళ్ళ ఆరోగ్యం జీర్ణశక్తి పెరుగుతుంది హృదయ ఆరోగ్య మెరుగుపరుస్తుంది చర్మం కాంతివంతంగా మారుస్తుంది క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది బరువు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. చింతపండు చింతపండులో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి 100 గ్రాములు చింతపండులో దొరికే శక్తి 239 క్యాలరీల శక్తి ఉంటుం.ది అలాగే కార్బోహైడ్రేట్స్ 62 గ్రాములు, ప్రోటీన్ 2.8 గ్రాములు, ఫైబర్ 5.1 గ్రాములు, క్యాల్షియం 74 మిల్లీ గ్రాములు, ఐరన్ రెండు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు, విటమిన్ సి 3.5 గ్రాములు, పోషక విలువలు ఉంటాయి. ఇది వాడడం వల్ల జీర్ణశక్తి పెంపు హృదయపూర్వక ఇన్ఫెక్షన్ల నిరోధం లివర్ పరిశుభ్రత చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. ఇన్ని పోషక లో ఉన్న స్పెషల్ గ్రీన్ చట్నీని మనకు అందిస్తున్నారు శిరీష స్పెషల్ గ్రీన్ చట్నీ తయారు ఎలా చేస్తారో క్రింది ఆమె మాటల్లో వచ్చింది చూద్దాం.. కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర,కర్వేపాకు,గోధుమ గడ్డి, మునగాకు,పచ్చిమిర్చి – 6,ఎండు మిర్చి – 4,వెల్లుల్లి – 10,టమాటాలు - పెద్దవి 4,చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్ ,ఉప్పు – తగినంత,ఆయిల్ - కాస్త తక్కువ, జీలకర్ర తయారీ విధానం : ఒక గిన్నె తీసుకుని , ఆయిల్ వేసి , ఆయిల్ వేడి అయ్యాక కొంచం జీలకర్ర , పచ్చిమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు వేసాక కాస్త వేపి ఎండు మిర్చి వేసి ఒక నిమిషం వేగాక ఆకుకూరలు అన్ని వేసి , ఒక 10 మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా వేపి , టమాటా ముక్కలు , ఉప్పు , చింతపండు వేసి ఉడికే వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేయడమే... మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు.. జస్ట్ మగ్గితే చాలు... చల్లారాక మిక్సీలో వేసి రుబ్బుకోవడమే. స్పెషల్ గ్రీన్ చట్నీ రెడీ... రోటీ, చపాతీ, దోసె, ఇడ్లీతో,రైస్ లేదా బిర్యానీతో,స్నాక్స్, సమోసా లేదా పకోడీతో,సాండ్‌విచ్ లేదా మీరు కావాలంటే, చట్నీని ఎక్కువ సేపు నిల్వ చేసుకునే ట్రిక్‌లు కూడా చెప్పగలను.