4వ తరగతి ఉద్యోగులకు వేతనాలు పెంచండి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్
హైదరాబాద్ బ్యూరో,(ఆరోగ్య జ్యోతి): ఎన్ హెచ్ ఎం లో పనిచేయుచున్నటు వంటి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని గత 3 సంవత్సరాలుగా పోరా టాలు నిర్వహించిన ఫలితం రాలేదనీ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా అన్నారు.ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ నాలుగవ తరగతి ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం 10,400 ఇవ్వడం కరెక్ట్ కాదని నాలుగవ తరగతి ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటీలోని ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు జూలై 26 న మహాధర్నా నిర్వహించటం జరిగింద మీ పేర్కొన్నారు. కానీ ఇది జరిగి ఇప్పటికీ 2 నెలలు అవుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేద నీ వెంటనే నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు ఎన్ హెచ్ ఎం లో అధికారులు ఈ సంస్థలో పనిచేయుచు న్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఇందులో కొంత మందికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జీతాలు చెల్లిస్తూ కింది స్థాయి 4వ తరగతి ఉద్యోగులకు మాత్రం వారి పొట్ట కొడుతూ శ్రమదోపిడికి గురిచేయుచున్నారని వారు విమర్శించారు. తక్షణమే జీవో నెంబర్ 1195 లో నాలుగో తరగతి ఉద్యోగులకు 15,600 తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు...