Sports & Games

Breaking News

అక్టోబర్ 12న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం

ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451 

పిల్ల‌ల బంగారు భవిష్య‌త్తుకు   రెండు ప‌ల్స్ పోలియో చుక్క‌లు.

స్ల‌మ్ ఏరియాల్లో ప్ర‌త్యేకంగా దృష్టి సారించాలి.

జిల్లాలో అక్టొబ‌ర్ 12వ తేది ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మం .

జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్  క‌దిర‌వ‌న్ ప‌ల‌ని 

హైదరాబాద్, (ఆరోగ్య జ్యోతి): అక్టోబర్ 12న పల్స్ పోలియో ఇమేజెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పలాని తెలిపారు.
0-5 సంవ‌త్స‌రాల చిన్నారుల బంగారు భ‌విష్య‌త్తుకు  త‌ల్లి దండ్రుల బాధ్య‌త తీసుకుని,  ప‌ల్స్ పోలియో  చుక్క‌ల‌ను త‌ప్ప‌ని స‌రిగా వేయించి,  పోలియో నిర్మూల‌న‌కు సహకరించాలని  జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ( లోక‌ల్ బాడీస్‌) క‌దిర‌వ‌న్ ప‌ల‌ని పేర్కొన్న‌రు. 

సోమ‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో  అక్టోబ‌ర్ 12వ తేదిన  నిర్వ‌హించ‌నున్న  ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు  చేప‌ట్ట‌వ‌ల్సిన‌  ఏర్పాట్ల పై  మెడిక‌ల్‌, విద్యా శాఖ‌,  జిల్లా సంక్షేమ శాఖ అధికారులు,  స్వ‌చ్చంద సంస్ధ‌లు,  విద్యుత్ , త‌దిత‌ర  శాఖ‌ల‌కు సంబంధిత  అధికారులతో  జిల్లా రెవెన్యూ  అధికారి ఈ. వెంక‌టాచారితో క‌లిసి అద‌న‌పు క‌లెక్ట‌ర్  స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  జిల్లాలో  అక్టోబ‌ర్ 12వ తేదిన  ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు  అనుబంధ  శాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో  వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.  చిన్నారుల‌కు త‌ప్ప‌ని స‌రిగా ప‌ల్స్ పోలియో చుక్క‌ల‌ను వేయించాలని తెలిపారు.  12వ తేదిన  బూతుల వ‌ద్ద మిస్ అయిన  పిల్ల‌ల కోసం   13, 14,  15 వ‌ తేదీల‌లో 5600 బృందాలు ఇంటి ఇంటికి తిరిగి చుక్క‌లు వేస్తారని అయ‌న పేర్కొన్నారు. 

 హైద‌రాబాద్ జిల్లాలో సుమారు  0-5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు  గ‌ల 5,17,238 పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేసేందుకు దాదాపు   2800 బూతులు, 43 ట్రాన్సిట్ పాయింట్లు అలాగే 91 మొబైల్ బృందాల‌ను  ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.    ఉద‌యం  7.00 గంట‌ల నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ప‌ల్స్ పోలియో బూతులు ప‌నిచేస్తాయ‌ని అన్నారు.  అదే రోజున  164 హైరిస్క్ ఏరియాల‌లో బూతులు ఏర్పాటు చేయ‌బ‌డుతాయిన అన్నారు.
ఇందుకు గాను  సిబ్బంది మొత్తం 11,566, బూత్ స‌భ్యులు 11,200   విధులు నిర్వ‌హిస్తారని అన్నారు.  

   ఇటుక బ‌ట్టిల ప్రాంతాలు,  బ‌స్తీలు,   తాత్కాలిక శిబిరాలు , మార్కె ట్లు, దేవాల‌యాలు,  పార్కులు, జూ పార్క్ లాంటి ర‌ద్దీ ప్రాంతాల్లో  91 మొబైల్ బృందాలను  ప్ర‌త్యేకంగా  బూతులు ఏర్పాటు  చేసి  5 సంవ‌త్స‌రాలు చిన్నారుల గుర్తించి టీకాలు వేయుట‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. 
అలాగే బ‌స్టాండ్‌ల‌లో, రైల్యే స్టేష‌న్లు, మెట్రో స్టేష‌న్ల‌లో ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు  11వ తేది అర్ధ‌రాత్రి నుండి 14వ తేది అర్ధ‌రాత్రి వ‌ర‌కు నిరంత‌రంగా ప‌నిచేస్తాయిని అన్నారు. 

ఈ బృహత్తర బృహత్తర కార్య‌క్ర‌మంలో  అంగ‌న్ వాడీ టీచ‌ర్లు,  విద్యాశాఖ‌, విద్యుత్‌,  స్వచ్చంద సంస్ధ‌లు  మెడిక‌ల్ విద్యార్దులు, ఆశా వ‌ర్క‌ర్లు, ప్ర‌భుత్వ శాఖ సిబ్బంది, మ‌హిళా మండ‌ళ్లు వాలంటీర్లు  పాల్గొనాల‌ని సూచించారు.
 
  ప‌ల్స్ పోలియో పై విస్తృతి స్ధాయిలో  ప్ర‌చారం  గావించి,  ప్ర‌జ‌ల్లో  అవ‌గాహ‌న క‌ల్పించాలని  తెలిపారు.  ఇందుకు గాను  ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా,  బూతుల వ‌ద్ద‌, బ్యాన‌ర్లు,  అలాగే రేల్వే స్టేష‌న్ల‌లో, బ‌స్టాండ్‌ల‌లో  విరివిగా   ప‌బ్లిసిటి చేయాల‌ని, అలాగే  విద్యార్ధుల‌తో  ప‌ల్స్ పోలియో  ముందు రోజుల్లో  ర్యాలీలు నిర్వ‌హించాల‌ని  ఆయ‌న పేర్కొన్నారు. 

ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మాల రోజుల్లో  విద్యుత్ అంత‌రాయం లేకుండా   తగిన చ‌ర్య‌తు తీసుకోవాల‌ని ఆ శాఖ అధికారుల‌కు సూచించారు.    రైల్యే స్టేష‌న్ల‌లో , బ‌స్టాండ్‌ల‌లో    బూతులు ఏర్పాటు  త‌గిన వ‌స‌తులు క‌ల్పించాల‌ని అన్నారు. 

 ప‌ల్స్ పోలియో  విజ‌య‌వంతానికి సంబంధిత శాఖ అధికారుల‌, స్వ‌చ్చంద సంస్ధ‌లు,  అంగ‌న్ వాడీ టీచ‌ర్లు,  ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేసేందుకు  కృషి చేయాల‌ని ఆయ‌న తెలిపారు. 

ఈ స‌మావేశంలో  జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డా. J.వెంక‌టి,   జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  డాక్టర్ శ్రీధర్,  ఐయంఎ అధ్య‌క్షులు ద్వారకనాథ్ రెడ్డి ఇండియ‌న్  రెడ్ క్రాస్  జిల్లా అధ్య‌క్షులు భీమ్ రెడ్డి, surveillance వైద్యాధికారి Dr మురారి,జిల్లా  మీడియా అధికారి జక్కుల రాములు,సిపిఓ  డాక్టర్. సురేందర్,     పి. డి. అశోక్ చక్రవర్తి,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ   సంక్షేమ అధికారులు జి. ఆశన్న, కోటాజి,  ప్రవీణ్, ఇలియాస్ అహ్మద్,  జి.ఎం ఇండ్రస్ట్రీస్ పవణ్ కుమార్,  సికింద్రాబాద్ ఎస్‌హెచ్ ఓ  గ‌ణేష్‌, మిల‌ట‌రీ అధికారులు,  జిహెచ్‌యంసి అధికారులు, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, వైద్యాధికారులు, వివిధ శాఖల  జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.