Sports & Games

Breaking News

పిఎఫ్ చందాదారుల సమస్య పరిష్కారానికి పీఎఫ్ అధికారులతో సమావేశం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఉట్నూరు,(ఆరోగ్యజ్యోతి): అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో బిఎఫ్ చందాదారుల సమస్యలు మరియు ఇతర వాటిని పరిష్కరించేందుకు పీఎఫ్ అధికారులు ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంకంటి సుభాష్ తెలిపారు 
. ఈ సమావేశానికి ఈపీఎఫ్ఓ కరీంనగర్ నుండి అమిత్ ఖాజా సహబ్ ఇన్ఫర్మేషన్ మరియు ఎస్ ఎస్ ఏ ఎన్ శ్రీధర్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉటూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కు సంబంధించిన పిఎఫ్ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. పిఎఫ్ కు సంబంధించిన రకరకాల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్తే సమస్యకు పరిష్కారించడంతోపాటు కొన్ని సమస్యలకు పరిష్కారం మార్గాలు సూచిస్తారని ఆయన వివరించారు.