ప్రోగ్రాం అధికారుల అద్దె వహనుల బిల్లు చెల్లించండి
అద్దె వాహనాల బిల్లులు చెల్లించాలి
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
13 నెలలుగా కరువైన కుటుంబ పోషణ
* ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ రాజేష్ ఖన్నా
వరంగల్, (ఆరోగ్యజ్యోతి):: వరంగల్, హన్మకొండ డిఎం అండ్ హెచ్ కార్యాలయాల్లో ప్రోగ్రాం అధికారులు అద్దె వాహనాలకు సకాలంలో బిల్లు అందించక వాహన అద్యదారులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.ఆ వాహనాలకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ఆదివారం జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆరోపించారు. గత 13 నెలల నుండి ఆ వాహనదారులకు బిల్లులు చెల్లించని కారణంగా వారి కుటుంబాల్లో పోషణ కరువైంద నీ ఆయన పేర్కొన్నారు. వాహన బిల్లులు రాక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈఎంఐ లు ఇన్స్టాల్మెంట్లు ఇతర బిల్లులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేక దయనీయ పరిస్థితులు బాధిత కుటుంబాలకు భారంగా తయారయ్యాయని సానుభూతి వ్యక్తపరిచారు.. తక్షణమే పెంండింగ్లో ఉన్న అద్దె వాహనాల బిల్లులు చెల్లించి, బాధిత కుటు ంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్టోబర్ 1వ, తేదీలోపు అద్దె వాహనాల బిల్లులు చెల్లించని యెడల 2వ, తేదీ నుంచి బాధితుల పక్షాన ధర్నాకు దిగడం ఖాయమని ప్రకటించారు.