Sports & Games

Breaking News

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెల వేతనాలు ఇవ్వండి

అదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల జనరల్ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ నెల నెల వేతనాలు ఇవ్వాలని అదిలాబాద్ జిల్లా అవుట్సోర్సింగ్ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సోమిరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం నెల నెల వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నెల నెల వేతనాల అందే విధంగా చూడాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెల వేతనాలు వేస్తున్న విధంగానే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నెల నెల వేతనాలు వేయలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వారితో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వేసిన రోజే ప్రభుత్వం అదే రోజు వేతనాలు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లూరి రవి, సంతో,ష్ మహేందర్, రాకేష్, స్వామి, జి నరేష్ తోపాటు జిల్లా జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.