Sports & Games

Breaking News

ఆరోగ్యకరమైన మహిళతోనే బలమైన కుటుంబం

పల్నాడు,(ఆరోగ్యజ్యోతి): పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నలజాల సదాశివరావు, వైద్య అధికారి గఫ్రీన్, మాజీ జడ్పిటిసి బలరామకృష్ణ రాజ్, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కుటుంబంలో మహిళ ఆరోగ్యంవంతంగా ఉంటే ఆ కుటుంబం సమాజంలో బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని వక్తలు నల్లజాల సదాశివరావు, బలరామకృష్ణ రాజ్, గఫ్రీన్, శిఖా శాంసన్ లు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరులో స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నలజాల సదాశివరావు, మాజీ జడ్పిటిసి బలరామకృష్ణంరాజు లు శిబిరా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలకు బిపి , షుగర్, రక్త పరీక్షలు టీబీ పరీక్షలు నిర్వహించటంతో పాటు నోటి, రొమ్ము, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడినవి పి ఎం జె వై , పి ఎం ఎం వి వై పథకాలపై అవగాహన కల్పించారు ఐసిడిఎస్ సిబ్బంది పౌష్టికాహార ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించారు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ 25వ తేదీన హసానా బాద్ లో 26వ తేదీన బయ్యవరంలో మరియు దొడ్లేరు ఒకటవ సచివాలయంలో, 27వ తేదీన క్రోసూరు మూడవ సచివాలయం పరిధిలో మరియు కందుకూరులో 29వ తేదీన దొడ్లేరు రెండవ సచివాలయం పరిధిలో మరియు స్వస్థ నారీ స శక్తి పరివార్ అభియాన్ ఉచిత క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త కామేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వీరయ్య, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామస్తులు ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.