Sports & Games

Breaking News

బీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా పరిధిలో.. ఊరూరా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు..

భీంపూర్,(ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం యందు అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని గ్రామాలలో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం,గ్రామ, ఆరోగ్య పోషకాహార సమావేశం ఏర్పాటు చేయడమైనదని"స్వస్త నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో "భాగంగా అంతర్బంద్,భీంపూర్,గిర్గాం,ధనోర, కరంజి,అర్లి, గ్రామాలలో మహిళలకు 195 చికిత్సలు, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయండం జరిగిందని ఇందులో చెవి,ముక్కు,గొంతు-1,దంతాల-1 సమస్య ఉన్న వారు,గర్భిణీ స్త్రీలు -15 కిశోర్ బాలికలు-91,క్షయ వ్యాధి గ్రస్తులు-8, అసంక్రామిత వ్యాధిగ్రస్తులు -146, వయోవృద్ధులు -22, గర్భాశయ క్యాన్సర్ -40 అవగాహన కల్పించడం,అందరికి చెవి, ముక్కు, దంతాల, ఆరోగ్యశ్రీ , ట్రస్ట్కేర్,రక్తం, అవయవదానం గురించి, తినే ఆహారపదార్థాలలో నూనే,చక్కెర 10% తగ్గించడం,స్థన,నోటి, గర్భాశయ క్యాన్సర్స్, పోషకాహారం ప్రాధాన్యత, వయోవృద్ధులు పరీక్షలు,క్షయ,సికెలస్ సెల్ అనీమియా వ్యాధుల గూర్చి, యోగా ద్వారా ఆరోగ్య సాధన,ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడతో పాటు,మన జిల్లా క్షయ నివారణ అధికారి డా "సుమలత గారి ఆదేశాలను అనుసరించి"లీముగూడ" గ్రామంలో క్షయ వ్యాధి నిర్థారణ కోసం ఇండ్లసందర్శణలు చేసి ప్రతీ ఇంటి వ్యక్తుల యొక్క తెమడ/ కళ్ళె పరీక్షల కోసం 100 ప్రజలవి సేకరించి పంపించడంతో పాటుక్షయ రోగి ఇండ్లను సందర్శించి మందులను వాడుచున్నార లేదా చూడడంతో పాటు పోషకాహారం తీసుకోవాల్సిందిగా కోరడమైనదని, ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో "థీమోఫాస్" ఆంటిలార్వల్ మందును పిచికారి చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డా "నిఖిల్ రాజ్,మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రూహిదాస్,మేఘ,యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, మాయావతి,సాహితి, ఆరోగ్య కార్యకర్తలు లచ్చుబాయ్,సరస్వతి, సుజాత, భాగ్యవతి, జానాబాయ్, విజయలక్ష్మి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఆశా కార్యకర్తలు భారతి, శకుంతల,పద్మ, మీర,స్వప్న పాల్గొన్నారు