Sports & Games

Breaking News

పదవి విరమణ పొందిన ఎంఈఓ కి ఘనంగా సన్మానించిన వైద్య దంపతులు

పదవి విరమణ ఉద్యోగికి ఘన సన్మానం 

ఆదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): ఇటీవల పదవి విరమణ చేసిన శ్రీ కంటే నరసయ్యకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఇన్చార్జి డాక్టర్ రాజలక్ష్మిలు ఘనంగా ఆయనను ఆదివారం రోజు సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది తప్పనిసరి అని తెలిపారు పదవి విరమణ పొందిన కంటే నరసయ్య ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి దైవంగా భావించి ఆయన సర్వీస్ లో ఎందరో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉందని చెప్పారు. ఉపాధ్యాయుడుగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన మండల విద్యా అధికారి స్థాయి వరకు ఎదిగి విద్యను ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.