Sports & Games

Breaking News

నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి

జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి

ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి):జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ అన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో జిల్లా మహాసభ ఏఐటీయూసీ జిల్లా ఆధ్యక్షుడు టి.దివాకర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా రామ రాజేష్ ఖన్నా పాల్గొని మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి పచ్చి 21 నెలలు గడుస్తున్న ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ 
ఉద్యోగులకు కనీస వేతనాలు సవరించి పెంచకుందా గత ప్రభుత్వం లాగే దాట వేస్తుందని, వెంటనే కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనేక పోరాటాల పల్ల సాదించుకున్న 29 కార్మిక చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, కార్మిక హక్కులను లేబర్ లను తీసుకొచ్చి కార్పొరేట్, పెట్టుబ డిదారులకు మేలు చేస్తున్న కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రకటించటం ఎన్టీయే ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ అల్ క్యాడర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్,  మధుకర్, నాయకులు చిరంజీవి, ముస్తక్, శ్రీనివాస్, తోపాటు పాల్గొన్నారు.

*నూతన కమిటీ ఎన్నిక.*.

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్. సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎన్ హెచ్ ఎం జిల్లా గౌరవ అధ్యక్షుడుగా బోగే ఉపేందర్ (ఏఐటీయూసీ), జిల్లా అధ్యక్షులుగా (ఎం.ఎల్.హెచ్ పి.) జి.గణేష్, ఎం.డీ. షకీల్,ఉపాధ్యక్షులుగా ఏ. చిరంజీవి,  జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుడి పెళ్లి మధుకర్ (కాంటిజెంట్ వర్కర్), సహాయ కార్యదర్శిగా ముస్తాక్ హుస్సేన్, కోశాధికారి  (టీ హబ్ రేడియోగ్రాఫర్) సీ.హెచ్ నాగేష్, ఈ.సీ కౌన్సిల్ మెంబర్గా (బీఎస్సీ నర్సింగ్) సౌమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.