Sports & Games

Breaking News

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వినతి పత్రం

.నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ఛాంబర్ లో వినతిపత్రం 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ హెల్తి మిషన్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వినతి పత్రంలో వివరించారు. చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కొట్టించడం లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రభుత్వపథకా లలో శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగ ఖాళీ లలో కేంద్ర రాష్ట్ర బాగా స్వామ్య నిధులతో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్దతిలో నియామకమై వివిధ క్యాడర్ ఉద్యోగాల హోదాలలో పనిచేస్తున్నారు.ఔట్ సోర్సింగ్ పద్ధతి లో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లింపు, వేతనాలలో మినహా యించిన ప్రావిడెంట్ ఫండ్ మరియు ఈ.యస్.ఐ కాంట్రిబ్యూషన్ ను సంబంధిత ఉద్యోగుల అకౌంట్లలో జమ చేయటం లో ఏజెన్సీ లు విఫలం కావటం వలన ప్రభుత్వం బాధ్యత వహించి మరియు ఏజెన్సీ విధానంను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా వేతనాలు చెల్లించాలని గత కొంత కాలం నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంను కోరుచున్నారు.అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు విధానంను పలువురు నాయకులు ప్రభుత్వం దృష్టి కి తీసుక పోవడం, ఇట్టి ప్రజా ప్రభుత్వం పై నమ్మకం ఉండి అతి త్వరలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని ఇట్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశ తో ఎదురు చూస్తున్నారు.అతి త్వరలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందనే లీకు వార్త వలన అందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోషము తో ఉన్నారు. కాని విడతలవారిగా తాత్కాలిక ఉద్యోగులను తొలగింపు జరుగుతుందనే లీకు వార్తల వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుచున్నారు.శాశ్వత ఖాళీల లో నియమించబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, నియామక తేది నాటికి సరియగు విద్యా అర్హత లేని వారిని, మెరిట్ పద్ధతి లో ఎంపిక కానటువంటివారిని తొలగిస్తారని మరియు పూర్తి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ద్వారా ఎంపిక అయిన మరియు ఎంపిక చేసిన వారిపై, సహకరించిన వారిపై కూడా చట్టబద్ధంగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని, ప్రభుత్వం ఆర్ధిక భారం తగ్గించు కుంటున్నదని ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. ఇక మిగిలిన మెరిట్ పై నియామకమైన అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులను అన్ని క్యాడర్ ల వారిగా కలిపి ప్రభుత్వ శాఖలు మార్పులు, పనిచేయు ప్రాంతములు క్యాడర్ల వారిగా మార్పులు జరుగుతాయని చర్చ జరుగుచున్నది. తాత్కాలిక ఉద్యోగుల పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా తెలియ చేయాలని కోరుచున్నాము.