Sports & Games

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : బోరంచు శ్రీకాంత్ రెడ్డి

 

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి  ఒక ప్రకటనలో కోరారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.  అలాగే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్సాపార్మర్స్, ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్ద కు వెళ్ళరాదన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు జారీ చేస్తున్నందున వాగులు, చెరువులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు , జిల్లా అధికారులందరూ పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజలకు అవగాహన కల్పించి, వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.