డైరెక్టర్ గారు...మీ. ఉద్యోగులు (సూపర్వైజర్ల) వైపు జర చూడు..
.- చిన్నపిల్లలు తండ్రిని తోపుడుబండ్లతో తీసుకెళ్తున్న పట్టించుకోని సూపర్వైజర్లు
- ఇలాంటి ఉద్యోగులు సూపర్వైజర్లు రిమ్స్ లో అవసరమా
- మామూలు ఉద్యోగులే సూపర్వైజర్లుగా చలామనీ
- నాడు కాంట్రాక్టర్ల వైపు.. నేడు అధికారుల వైపు..
- డైరెక్టర్ గారు- రోగులను పట్టించుకోని ఉద్యోగులతో పని ఏంటి..
- ఫిర్యాదులు ఎన్ని వచ్చినా సూపర్వైజర్ల గురించి పట్టించుకోని అధికారులు
- పది రోజుల క్రితమే సూపర్వైజర్లపై ఫిర్యాదు చేసిన ఉద్యోగులు ?..
- అయినా ప్రభుత్వ సూపర్వైజర్లు ఉండగా ప్రైవేటు వారితో పని ఏంటి?..
- రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రిమ్స్ లో సూపర్వైజర్ల వ్యవస్థ ఏంటి
- అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు చూడాలి మరి
ఆదిలాబాద్ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ లో సోమవారం 11 గంటల ప్రాంతంలో ఒక ఆటోలో కుటుంబం అంటే తల్లి ఇద్దరు పిల్లల దిగారు.. తండ్రి అనారోగ్యంగా ఉంటే స్ట్రక్చర్ తీసుకువచ్చి ఆటోలో దాదాపు పది నిమిషాలు స్ట్రక్చర్ పై కూర్చోబెట్టటానికి నానా తంతాలు పడ్డారు ఆ పిల్లలు.. పక్కనే ఉన్న రిమ్స్ ఉద్యోగులు (సూపర్వైజర్లు) చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప ఆ చిన్నారులకు సహాయం కూడా చేసేందుకు ముందుకు రాలేదు. మానవత్వం అనేది ఉన్న ప్రతి వ్యక్తి సహాయ సహకారాలు అందిస్తారు కానీ మానవత్వం లేని ఆ ఉద్యోగులు సూపర్వైజర్ గా కిరీటం తగిలించుకొని రోగులకు సేవలు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు.
తోపుడుబండ్లపై పిల్లలు తండ్రిని ఎలాగో కూర్చోబెట్టి తీసుకువెళ్తున్న పక్కనే ఉన్న ఉద్యోగులు (సూపర్వైజర్లు) ఆ చిన్నారులు తీసుకు వెళుతున్న తోపుడు బండి పక్కన నుంచి వెళ్తున్నారు తప్ప వారికి సహాయం కూడా అందించలేరు. కనీసం కనికరము జాలి దయ లేకుండానే పక్కనుంచి వెళ్తున్నారే తప్ప పట్టించుకోలేదు.. వారు సూపర్వైజర్లు కాదు కదా మామూలు ఉద్యోగుల్ని "అధికారులు", కాంట్రాక్టర్లు" వాళ్లకు "కిరీటాన్ని" తగిలించి సూపర్వైజర్ గా తయారు చేశారు. జాలి దయ లేని సూపర్వైజర్లు ఆ ఉద్యోగులు రిమ్స్ లో పనిచేయడానికి అర్హత కూడా లేదని రోగులు అంటున్నారు. చిన్నారులపై జాలి దయ లేని ఆ ఉద్యోగులు రిమ్స్ లో పనిచేసిన ఒకటే చేయకున్నా ఒకటే అంటున్నారు. రోగులు.. చిన్నపిల్లలు స్ట్రక్చర్ పై తీసుక వెళ్తుంది కనికరం ఉన్న ఎవరైనా పట్టించుకుంటారు. కానీ రీమ్స్ లో మాత్రం ఆ ఉద్యోగులు చిన్నారెడ్డి పై జాలి చూపనివారు ఇక వేరే సంఘటనలు జరుగుతే ఎలాంటి జాలి చూపెడతారో మనకు స్పష్టంగా బొమ్మల్లో అర్థమవుతుంది. రిమ్స్ లో సూపర్వైజర్ గా చలామణి అవుతున్న ఉద్యోగులపై ఎన్నోసార్లు ఫిర్యాదులు వచ్చాయి కానీ ఉన్నతాధికారులు మాత్రం వారికి వత్తాస్తు పలుకుతున్నారే తప్ప వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు దీంతో వారి ఆగాడాలు పని దొంగతనం రోజురోజుకు మితిమీరి పోతుంది. ఒకప్పుడు కాంట్రాక్టర్ చుట్టూ తిరిగేవారు. ప్రభుత్వ జీతం తీసుకోవడం కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేయడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం కాంటాక్ట్ వ్యవస్థ రద్దయి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లారు మరి రిమ్స్ డైరెక్టర్ గారు... వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.. గతంలో అనేకసార్లు "ఆరోగ్య జ్యోతి" కూడా ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ పై నెట్టివేశారు అధికారులు.. ఈసారి డైరెక్టర్ గారు.. ఎవరిపై నెట్టు వేస్తారో చూడాలి మరి... ఒకటి రెండు ఎందుకు ఉద్యోగులు ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు ఉద్యోగులు అంటే సూపర్వైజర్లపై ఫిర్యాదులు చేశారు.. రోగులు ఫిర్యాదు చేశారు ..అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేశారు అయినా పట్టించుకోలేదు.. సూపర్వైజర్ వ్యవస్థ అనేది ఒకరు ఇద్దరు ఉంటారు.. అది కూడా అది కష్టం మీద .. ప్రభుత్వ ఆసుపత్రి మరియు వైద్య కళాశాలలో గవర్నమెంట్ సూపర్వైజర్ లే ఉంటారు అన్ని రకాల బాగోగులు చూసుకునేది వారిలే కానీ తెలంగాణలో ఎక్కడలేని విధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సూపర్వైజర్ వ్యవస్థ పుట్టుకొచ్చింది దీంతో లాభాలు మాత్రం కాంట్రాక్టర్లు అధికారులకు.. పెత్తండనం మాత్రం సూపర్వైజర్లకు.. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలి.. రిమ్స్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సూపర్వైజర్ వ్యవస్థను ఒక వృక్షంగా తయారు చేసుకున్నారు.. ఒకప్పుడు కాంట్రాక్టర్ వద్ద పలికిన సూపర్వైజర్లు ప్రస్తుతం అధికారులకు అండదండలుగా మారారు.. పారిశుధ్యం చూడవలసిన సూపర్వైజర్లు వ్యక్తిగతంగానే ఆలోచించి అధికారులకు మాత్రమే వత్తాసు పలుకుతున్నారంటే ఈ వ్యవస్థ ఇలా తయారయిందో అర్థమవుతుంది.. ఉద్యోగులకు వచ్చేవారు కొందరైతే నెల తరబడి రానివారు సైతం ఉన్న మేనేజ్ చేయడంలో వారిని కాపాడడంలో ఉద్యోగులు (సూపర్వైజర్లు)మనోళ్లు డిగ్రీ తీసుకున్నారు.. ఒకటి రెండు ఎందుకు చాలా ఉన్నాయి.. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ కు వివరణ కోరగా మంగళవారం రోజు సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పారు. రిమ్స్ ఆసుపత్రి కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపర్వైజర్ వ్యవస్థపై త్వరలో ఆరోగ్య జ్యోతిలో ప్రత్యేక కథనాలు..