అదిలాబాదులో "అరకిలో" బరువు శిశువు జననం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఆదిలాబాద్ లో అరకిలో శిశువు జననం..
ఆదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్యజ్యోతి)
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో
కేవలం 500 గ్రాముల బరువుతో జన్మించిన శిశువు ప్రాణాలు కాపాడటానికి రిమ్స్ వైద్యులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. ఇప్పటికే మూడు రోజులుగా చికిత్స అంది స్తున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం శాంతినగర్ కాలనీ కి చెందిన ఓ గర్భిణికి ముందస్తుగా ఆరు నెలలకే ప్రసవమైంది. ఆడ శిశువు కేవలం అర కిలో బరువు ఉండటంతో రిమ్స్ ఎస్ ఎన్సీయూ(స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్) కి వైద్యులు రిఫర్ చేశారు. ఆ విభాగ బాధ్యుడు డాక్టర్ అనంత్ రావు పర్యవేక్షణలో మూడు రోజులుగా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇలా అతి తక్కువ బరువుతో ముందస్తుగా జన్మించిన శిశువులు బత డం అరుదని ఆయన పేర్కొన్నారు. ఈ శిశువు ఇప్పటివరకు బతికి ఉండటం అదృష్టమన్నారు. ప్రాణాలు నిలపడానికి తాము శాయశక్తులా కృషిచేస్తున్నామని వెల్లడిం చారు. ఇలాంటి శిశువులు జన్మించడం చాలా అరుదని తెలిపారు.