Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Sunday, June 28, 2026

పెండింగ్ అలవెన్సులు విడుదల చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు విడుదల చేయాలని డిమాండ్

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా టిబి (క్షయవ్యాధి) ఉద్యోగులు ఈరోజు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
క్షయవ్యాధి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు POL (Petrol, Oil & Lubricants), వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు, FTA (Field Travel Allowance) అలవెన్సులు గత మూడు సంవత్సరాలుగా బకాయిలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్తులో అలవెన్సులు సకాలంలో చెల్లించేలా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన చేపట్టి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Bottom Ad Space

Veda Software Ad