Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Monday, June 29, 2026

1195 జీవో అమలు, ఎన్ టి ఈ పి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


ఖమ్మం,(ఆరోగ్య జ్యోతి):తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 1195 జీవోను తక్షణమే అమలు చేయాలని, అలాగే ఎన్ టి ఈ పి గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ట్రావెలింగ్, పి ఓ ఎల్, డేటా బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ, వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్. సందీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, ట్రెజరర్ శివ మరియు తదితరులు పాల్గొన్నారు.

Bottom Ad Space

Veda Software Ad