ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని "స్వస్త నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో "(ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం)భాగంగా ప్రత్యేక వైద్య శిబిరంలో డా" సంగీత గర్భకోశం నిపుణులు,డా" హుతేష్ దేవ్ జెనరల్ సర్జన్,డా" సంధ్యారాణి ఆప్తాల్మాజిస్ట్ గార్లు పాల్గొని రిమ్స్ ఆదిలాబాద్ వారు పాల్గొని ధనోర,భీంపూర్, అర్లి, అంతర్బంద్, గ్రామాల మహిళలకు 112చికిత్సలు, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయండం జరిగిందని ఇందులో చెవి,ముక్కు,గొంతు-0,దంతాల-0 సమస్య ఉన్న వారు,గర్భిణీ స్త్రీలు -80 కిశోర్ బాలికలు-35,క్షయ వ్యాధి గ్రస్తులు-5, అసంక్రామిత వ్యాధిగ్రస్తులు -32, వయోవృద్ధులు -6, గర్భాశయ క్యాన్సర్ -21 అవగాహన కల్పించడం,అందరికి చెవి, ముక్కు, దంతాల, ఆరోగ్యశ్రీ , ట్రస్ట్కేర్,రక్తం, అవయవదానం గురించి, తినే ఆహారపదార్థాలలో నూనే,చక్కెర 10% తగ్గించడం,స్థన,నోటి, గర్భాశయ క్యాన్సర్స్, పోషకాహారం ప్రాధాన్యత, వయోవృద్ధులు పరీక్షలు,క్షయ,సికెలస్ సెల్ అనీమియా వ్యాధుల గూర్చి, యోగా ద్వారా ఆరోగ్య సాధన,ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడతో పాటు,మన జిల్లా క్షయ నివారణ అధికారి డా "సుమలత గారి ఆదేశాలను అనుసరించి"లీముగూడ" గ్రామంలో క్షయ వ్యాధి నిర్థారణ కోసం ఇండ్లసందర్శణలు చేసి ప్రతీ ఇంటి వ్యక్తుల యొక్క తెమడ/ కళ్ళె పరీక్షల కోసం 41 ప్రజలవి సేకరించి పంపించడంతో పాటుక్షయ రోగి ఇండ్లను సందర్శించి మందులను వాడుచున్నార లేదా చూడడంతో పాటు పోషకాహారం తీసుకోవాల్సిందిగా కోరడమైనదని, శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం మరియు ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో "థీమోఫాస్" ఆంటిలార్వల్ మందును పిచికారి చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డా "నిఖిల్ రాజ్,మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డా" టి, నిఖిల్ రాజ్,ఆర్.బి.యస్.కె డా"నరేంధర్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రోహిదాస్,మేఘ, ప్రియాంక నర్సింగ్ ఆఫీసర్,యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, మాయావతి,సాహితి, ఆరోగ్య కార్యకర్తలు లచ్చుబాయ్,సరస్వతి, సుజాత, భాగ్యవతి,జానాబాయ్, విజయలక్ష్మి, విష్ణుకుమార్,ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఆశా కార్యకర్తలు భారతి, శకుంతల,పద్మ, మీర,స్వప్న, రేఖ,రోజ,శకుంతల, సంతోషిణి,శంకర్, రేఖ, రాందాస్ సిబ్బంది పాల్గొన్నారు.
LATEST UPDATES
Friday, September 26, 2025
Tags
Continue Reading
హెచ్ఐవి గురించి చర్చిద్దాం - హెచ్ఐవి ని నివారిద్దాం
Arogyajyothi Daily
September 26, 2025
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
పల్నాడు (ఆరోగ్యజ్యోతి)హెచ్ఐవి గురించి చర్చిద్దాం హెచ్ఐవి ని వారిద్దాం అని మన భావి తరాలు హెచ్ఐవి బారిన పడకుండా రక్షించుకోవాలంటే, మరొకసారి హెచ్ఐవి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మరియు చర్చించటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నరసరావుపేట లోని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వాహనం ప్రొజెక్టర్ ద్వారా హెచ్ఐవి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి చెందే పద్ధతి, హెచ్ఐవి వ్యాప్తి నివారణ చర్యలు వివరించారు. హెచ్ఐవి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రచురించిన కరపత్రములు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్త అనుపమ టిబి సూపర్వైజర్ సౌజన్య, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎల్ నాగలక్ష్మి, కె ఈశ్వర్, ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Continue Reading
పండుగ అడ్వాన్స్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఇవ్వాలినీ వినతి పత్రం
Arogyajyothi Daily
September 26, 2025
-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇవ్వాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ డిమాండ్ చేస్తూ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయములో సూపరిండెండెంట్ అనిల్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ... లక్షల రూపాయల జీతం పొందే పర్మినెంట్ కార్మికులకు రూ. 25 వేల దసరా అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కనీసం రూపాయలు రూ.20 వేల దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పర్మినెంట్ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, వారికి రూ.50 వేలు చెల్లించాలని కూడా కోరుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమించి ఎన్ హెచ్ ఎం సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం తగదని పేర్కొన్నారు. వారికి కూడా పండుగ ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలని, వారికి కూడా రూపాయలు 20 వేల దసరా అడ్వాన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం స్కీము లో పనిచేస్తున్న వారందరితోపాటు డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా నూతన జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారము పిఆర్సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర సంపత్ పటేల్, జిల్లా అధ్యక్షులు జన్ను కోర్నల్ మరియు తదితరులు పాల్గొన్నారు...
Tags
Continue Reading
Thursday, September 25, 2025
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సర అడ్మిషన్లు
Arogyajyothi Daily
September 25, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో 78 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
» రెండో విడత ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్
» 2నుంచి తరగతులు
» ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్
ఖమ్మం,(ఆరోగ్యజ్యోతి):
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలు మొదలయ్యినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత జాతీయ కోటాలో 15సీట్లు భర్తీ కాగా స్టేట్ కోటాలో 63 సీట్లు మొత్తంగా ఇప్పటి వరకు 78 సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ సెప్టెం బరు 29 నుంచి మెదలవుతుంద నీ ప్రిన్సిపాల్ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 100 సీట్లకు గాను మొదటి విడతలోనే 78సీట్లు భర్తీకా వడం గమనార్హమన్నారు. అక్టోబరు 2 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన రెండో ఏడాది ఎంబీబీఎస్ ఫలితాల్లో ఖమ్మం మెడికల్ కళాశాల విద్యా ర్థులు మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. 96శాతం ఉత్తీర్ణులయ్యారని వీటిలో 46 మంది మెదటి శ్రేణిలో, 17 మంది విద్యార్థులు డిస్టెంక్షన్ ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మంచి విద్యతోపాటు అనుబంధ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. అనుభవం గల ఆధ్యాపకుల ను ప్రభుత్వ నియమించడం వల్ల కళాశాలలో మంచి విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యతోపాటు రోగులకు మంచి నాణ్యమైన వైద్య సేవలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నాం అని తెలిపారు.
Tags
Continue Reading
సిద్దిక్ నగర్ లో..స్వశక్తి వైద్య శిబిరం
Arogyajyothi Daily
September 25, 2025
హైదరాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బస్ కమ్యూనిటీ బస్తీ దవఖాన సిద్ధిక్ నగర్ లో శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎస్పిహెచ్ఓ డాక్టర్ శ్రీధర్ సూరజ్ బాన్ క్లస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పక్కనపదిగా ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు ఇందులో భాగంగా హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కేన్సర్ అనుమానిత కేసులు మరియు ట్యూబర్‌కులోసిస్ స్క్రీనింగ్ చేసి, తగిన రిఫరల్స్ అందజేయడం.గర్భిణీ స్త్రీలకు అంథెనాటల్ చెకప్‌లు మరియు మాతృ ఆరోగ్య సేవలు.హెమోగ్లోబిన్ పరీక్షలు చేసి రక్తహీనతను గుర్తించి చికిత్స చేయడం.మాసికధర్మ పరిశుభ్రత, పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై కౌన్సిలింగ్.రక్తదానం సేవలపై అవగాహన మరియు ప్రోత్సాహం.సేవలను అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్రార్ ఉల్ హక్ షేక్, నర్సింగ్ ఆఫీసర్ వి.పద్మ, /\ఠాకూర్ దీప్మాల, సపోర్ట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు
Tags
Continue Reading
Wednesday, September 24, 2025
.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన మెగా శిబిరం
Arogyajyothi Daily
September 24, 2025
నాగర్ కర్నూల్, కల్వకుర్తి ,(ఆరోగ్య జ్యోతి):పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సుప్రభాతచేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరం లో 50 మంది రక్త దానం చేసారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ట్రస్ట్ ఫౌండర్ జూలూరి రమేష్ బాబు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గందరవి లో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈసారి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారని తెలిపారు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యం కానీ నీరసం కానీ ఉండడని తెలిపారు రక్తదానం పై అవగాహన కల్పించవలసిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండల రేవంత్,డి నితిన్, కోశాధికారి లు సంబు తరుణ్,పోల గిరిబాబు, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోలాటాలు, దాండియా తోపాటు మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు ఉంటాయి అని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Continue Reading
కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు
Arogyajyothi Daily
September 24, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మేడ్చల్ -మల్కాజ్గిరి,(ఆరోగ్య జ్యోతి):కుషాయిగూడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో బ్రతుకమ్మ సంబరాలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఉమాగౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డాక్టర్ ఉమాగౌరి అధ్యక్షతన జరిగిన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమా గౌరీ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బతకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలిపారు. బతుకమ్మ సంబరాలు భాగంగా మహిళలు పాటలు పాడట్టు కోలాటాలు వేశారు. అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ వేడుకలలో డాక్టర్ శిరీష ,డాక్టర్ శైలజ ,డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సుప్రియ, డాక్టర్ మధులిక మరియు డాక్టర్ అరుణ్ ,డాక్టర్ స్మిధ ,సీనియర్ అసిస్టెంట్ విష్ణు, సిహెచ్ఓ శ్యామ్, సంజయ్, నర్సింగ్ ఆఫీసర్ కవిత, ల్యాబ్ మేనేజర్ మహేశ్వరి, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, రాగిని, మహేశ్వరి, రాణి, రాధిక, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు
కార్యాలయ వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ లు, హెల్త్ సూపర్వైజర్ లు , నర్సింగ్ ఆఫీసర్లు,ఫార్మాసిస్టు దేవిక , ఎన్.హెచ్.ఎం దమ్మాయిగూడ బస్తి దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ మంగళపాటి సుమన్ , బస్తి దవాఖాన సిబ్బంది,పల్లె దవాఖాన సిబ్బంది, తెలంగాణ డయాగ్నోసిస్ స్టాప్, ఆశా వర్కర్లు, డివిజనల్ వైద్య శాఖ మహిళా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు..
Tags
Continue Reading
బీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా పరిధిలో.. ఊరూరా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు..
Arogyajyothi Daily
September 24, 2025
భీంపూర్,(ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం యందు అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని గ్రామాలలో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం,గ్రామ, ఆరోగ్య పోషకాహార సమావేశం ఏర్పాటు చేయడమైనదని"స్వస్త నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో "భాగంగా అంతర్బంద్,భీంపూర్,గిర్గాం,ధనోర, కరంజి,అర్లి, గ్రామాలలో మహిళలకు 195 చికిత్సలు, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయండం జరిగిందని ఇందులో చెవి,ముక్కు,గొంతు-1,దంతాల-1 సమస్య ఉన్న వారు,గర్భిణీ స్త్రీలు -15 కిశోర్ బాలికలు-91,క్షయ వ్యాధి గ్రస్తులు-8, అసంక్రామిత వ్యాధిగ్రస్తులు -146, వయోవృద్ధులు -22, గర్భాశయ క్యాన్సర్ -40 అవగాహన కల్పించడం,అందరికి చెవి, ముక్కు, దంతాల, ఆరోగ్యశ్రీ , ట్రస్ట్కేర్,రక్తం, అవయవదానం గురించి, తినే ఆహారపదార్థాలలో నూనే,చక్కెర 10% తగ్గించడం,స్థన,నోటి, గర్భాశయ క్యాన్సర్స్, పోషకాహారం ప్రాధాన్యత, వయోవృద్ధులు పరీక్షలు,క్షయ,సికెలస్ సెల్ అనీమియా వ్యాధుల గూర్చి, యోగా ద్వారా ఆరోగ్య సాధన,ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడతో పాటు,మన జిల్లా క్షయ నివారణ అధికారి డా "సుమలత గారి ఆదేశాలను అనుసరించి"లీముగూడ" గ్రామంలో క్షయ వ్యాధి నిర్థారణ కోసం ఇండ్లసందర్శణలు చేసి ప్రతీ ఇంటి వ్యక్తుల యొక్క తెమడ/ కళ్ళె పరీక్షల కోసం 100 ప్రజలవి సేకరించి పంపించడంతో పాటుక్షయ రోగి ఇండ్లను సందర్శించి మందులను వాడుచున్నార లేదా చూడడంతో పాటు పోషకాహారం తీసుకోవాల్సిందిగా కోరడమైనదని, ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో "థీమోఫాస్" ఆంటిలార్వల్ మందును పిచికారి చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డా "నిఖిల్ రాజ్,మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రూహిదాస్,మేఘ,యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, మాయావతి,సాహితి, ఆరోగ్య కార్యకర్తలు లచ్చుబాయ్,సరస్వతి, సుజాత, భాగ్యవతి, జానాబాయ్, విజయలక్ష్మి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఆశా కార్యకర్తలు భారతి, శకుంతల,పద్మ, మీర,స్వప్న పాల్గొన్నారు
Tags
Continue Reading
ఆరోగ్యకరమైన మహిళతోనే బలమైన కుటుంబం
Arogyajyothi Daily
September 24, 2025
పల్నాడు,(ఆరోగ్యజ్యోతి): పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నలజాల సదాశివరావు, వైద్య అధికారి గఫ్రీన్, మాజీ జడ్పిటిసి బలరామకృష్ణ రాజ్, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కుటుంబంలో మహిళ ఆరోగ్యంవంతంగా ఉంటే ఆ కుటుంబం సమాజంలో బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని వక్తలు నల్లజాల సదాశివరావు, బలరామకృష్ణ రాజ్, గఫ్రీన్, శిఖా శాంసన్ లు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరులో స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నలజాల సదాశివరావు, మాజీ జడ్పిటిసి బలరామకృష్ణంరాజు లు శిబిరా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలకు బిపి , షుగర్, రక్త పరీక్షలు టీబీ పరీక్షలు నిర్వహించటంతో పాటు నోటి, రొమ్ము, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడినవి పి ఎం జె వై , పి ఎం ఎం వి వై పథకాలపై అవగాహన కల్పించారు ఐసిడిఎస్ సిబ్బంది పౌష్టికాహార ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించారు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ 25వ తేదీన హసానా బాద్ లో 26వ తేదీన బయ్యవరంలో మరియు దొడ్లేరు ఒకటవ సచివాలయంలో, 27వ తేదీన క్రోసూరు మూడవ సచివాలయం పరిధిలో మరియు కందుకూరులో 29వ తేదీన దొడ్లేరు రెండవ సచివాలయం పరిధిలో మరియు స్వస్థ నారీ స శక్తి పరివార్ అభియాన్ ఉచిత క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త కామేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వీరయ్య, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామస్తులు ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags
Continue Reading
జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలు
Arogyajyothi Daily
September 24, 2025
మంచిర్యాల,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో ఆరోగ్య మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినారు ఈ వైద్య శిబిరంలో 172 మంది నమోదు చేసుకున్నారు ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజీషియన్ డాక్టర్ శిల్ప కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస స్త్రీ వైద్య నిపుణులు ఎమ్మెల్యే సీలు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఈ ప్రత్యేక వైద్య శిబిరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయించడం మందులను చికిత్సలు అందించడము రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు బిపి డయాబెటిస్ క్యాన్సర్ల నిర్ధారణ మరియు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు మరియు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి పరబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కలిగించడం జరిగినది ముఖ్యంగా పిల్లలకు టీ తాగిపించడం సరైన సమయంలో సరైన వయసులో ఇవ్వడం మరియు టీవీ ద్వారా రోగులను గుర్తించి వారికి పోషకాహార కిట్టులు అందజేయడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస సిబ్బంది శ్రీ సత్తయ్య సి హెచ్ ఓ బుట్ట వెంకటేశ్వర్ జిల్లా మాస్ మియాధికారి పాల్గొన్నారు.
Tags
Continue Reading
ఔషధాలు సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం
Arogyajyothi Daily
September 24, 2025
• మందులు సరిగ్గా ఇవ్వకుంటే అనారోగ్యమే
• వ్యాసకర్త కటకం శంకర్
• నేడు ప్రపంచ ఫార్మసిస్ట్ డే
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):
డాక్టర్ రోగాలను గుర్తించి మందులు రాస్తారు.. డాక్టర్ రాసిన రాతను గుర్తించి ఆ మందులను సక్రమంగా ఇచ్చినప్పుడే రోగం తగ్గుముఖం పడుతుంది. ఆ మందులు ఇచ్చేవారే ఫార్మసిస్ట్ అని వ్యాసకర్త కటకం శంకర్ తెలిపారు. మందులు ఇవ్వటమే కాదు మందులు తయారు చేసేది కూడా ఫార్మాసిస్టులే ఫార్మసిస్టుల్లో రకరకాల కోర్సులు ఉన్నాయి. ఎం ఫార్మసీ బీఫార్మసీ డి ఫార్మసీ తో పాటు ఇతర కోర్సులు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుందని వ్యాసకర్త కటకం శంకర్ తెలిపారు. ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా వ్యాసకర్త కటకం శంకర్ అందించిన ప్రత్యేక కథనం... సెప్టెంబర్ 25 – ఫార్మసిస్ట్ లకు సేవలకు ప్రత్యేక గుర్తింపుని ఇచ్చే రోజుప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఫార్మసిస్ట్ డే ని జరుపుకుంటారు. 2009లో అంతర్జాతీయ ఫార్మసిస్ట్ సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం వేర్వేరు అంశాలపై నినాదాలు నిర్ణయించి, ఫార్మసిస్ట్ వృత్తి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.ఈ సంవత్సరం 2025కు నిర్ణయించబడిన థీమ్ “Think Health, Think Pharmacist”. అంటే ఆరోగ్యం అనగానే మనకు ఫార్మసిస్ట్ గుర్తుకురావాలి. ఈ నినాదం, కేవలం మాటల్లోనే కాదు, సమాజానికి ఇచ్చే ఆరోగ్య భరోసా వెనుక ఉన్న వాస్తవ సత్యం.ఫార్మసిస్ట్ – మందులు ఇచ్చే వ్యక్తి కంటే ఎక్కువమనకు సాధారణంగా “ఫార్మసిస్ట్” అంటే కేవలం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇచ్చే వ్యక్తి అని మాత్రమే భావన. కానీ, నిజానికి ఫార్మసిస్ట్ పాత్ర అందుకు మించినది.రోగులు తీసుకునే మందులు సరైన మోతాదులో ఉన్నాయా, వాటి మధ్య పరస్పర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నది చెబుతారు.రోగులకు మందులు ఎప్పుడు, ఎలా, ఎంతకాలం తీసుకోవాలో కౌన్సెలింగ్ చేస్తారు.
సైడ్ ఎఫెక్ట్స్ క్ట్స్ గురించి ముందుగానే అప్రమత్తం చేస్తారు.టీకాలు, వ్యాధి నివారణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.దీర్ఘకాలిక వ్యాధుల (మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు) ఉన్నవారికి నిరంతర సహకారం అందిస్తారు.
ప్రాణరక్షక ఔషధాలను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వంతో, పరిశ్రమలతో అనుసంధానం చేస్తారు.
రేషనల్ డ్రగ్ యూజ్ (మందులను సరైన సందర్భంలో మాత్రమే వాడటం)ను ప్రోత్సహించి, స్వీయ చికిత్స మరియు మందుల దుర్వినియోగం వంటి సమస్యలను తగ్గిస్తారు.ఈ విధంగా, ఫార్మసిస్ట్ ఆరోగ్య రంగంలో రోగి – వైద్యుడు – సమాజం మధ్య వంతెనగా వ్యవహరిస్తారు.నేటి పరిస్థితుల్లో ఫార్మసిస్ట్ ప్రాముఖ్యతప్రస్తుతం ఆరోగ్య రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.ఆంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల పెరుగుతోంది.సొంతంగా మందులు వేసుకొని అలవాటు వల్ల రోగులు తప్పు మందులు వాడి, సమస్యను మరింత పెంచుకుంటున్నారు.మత్తు పదార్థాల దుర్వినియోగం యువతను మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తోంది. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలాగా సరైన కౌన్సిలింగ్ అందిస్తారు.దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతూ ఉండటం వల్ల, నిరంతర మందుల వాడకం తప్పనిసరి అవుతోంది.ఈ నేపథ్యంలో ఫార్మసిస్ట్‌లు మాత్రమే ప్రజలకు సరైన మార్గదర్శకులుగా నిలుస్తారు. వారు మందులను అందించడమే కాకుండా, మందులు సరైన రీతిలో వాడితేనే వాటి ప్రయోజనం ఉంటుందని ప్రజలకు చెప్పగలరు.ఫార్మసిస్ట్ – ప్రజలకు దగ్గరగా ఉన్న ఆరోగ్య సలహాదారుప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్‌ను కలవడానికి సమయం పట్టవచ్చు. కానీ, సమాజంలో అందరికీ దగ్గరగా ఉండే వ్యక్తి ఫార్మసిస్ట్.చిన్న సందేహాలకైనా, పెద్ద సమస్యలకైనా మొదట సలహా ఇచ్చేది ఫార్మసిస్ట్.డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను సాధారణ భాషలో రోగికి అర్థమయ్యేలా చెప్పేది కూడా ఆయనే.ఒక రోగి ఎప్పుడైనా “ఈ మందు ఎప్పుడు తాగాలి? ఆహారంతో తీసుకోవచ్చా? ఇతర మందులతో కలిపి తీసుకుంటే ఏమైనా సమస్య వస్తుందా?” అని అడిగితే, మొదట సమాధానం చెప్పేది ఫార్మసిస్ట్.అందుకే వారిని “ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఆరోగ్య నిపుణులు” అని పిలుస్తారు.తెలంగాణ ఫార్మసిస్ట్‌లకు ప్రత్యేక గుర్తింపు – “ఫార్మసీ ఆఫీసర్స్”తెలంగాణ రాష్ట్రం ఇటీవల ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఫార్మసిస్ట్‌లకు “ఫార్మసీ ఆఫీసర్స్” అనే గౌరవప్రదమైన కొత్త నామకరణం ఇచ్చింది.ఈ నిర్ణయం ఫార్మసిస్ట్ వృత్తి ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. ఇది కేవలం పేరుమార్పు కాదు – ఇది ఒక గౌరవ సూచకం, బాధ్యతలకు గుర్తింపు, వృత్తి స్థాయికి ప్రతీక.ఇకపై ఫార్మసిస్ట్‌లు తమను సమాజానికి ప్రజారోగ్య అధికారులుగా పరిచయం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వారిలో ఉత్సాహాన్ని, గౌరవాన్ని, సేవాస్ఫూర్తిని పెంచుతుంది.
ఫార్మసిస్టుల సామాజిక బాధ్యత
జనరిక్ మందుల ప్రాముఖ్యతపై ప్రచారం – తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేయాలి.
రోగుల కౌన్సెలింగ్ శిబిరాలు – సరైన మందుల వాడకం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యా కార్యక్రమాలు.
CGMP (Current Good Manufacturing Practices) అవగాహన కార్యక్రమాలు – ప్రజలకు నాణ్యమైన మందుల తయారీ ప్రాముఖ్యతను వివరించడం.
తెలంగాణ ఫార్మసీ ఆఫీసర్లు ప్రజారోగ్యానికి అగ్రగాములుతెలంగాణ ఫార్మసీ ఆఫీసర్లు గత కొన్నేళ్లుగా అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షలాది రోగులకు సరైన మందుల పంపిణీ.COVID-19 సమయంలో టీకాలు, మందుల పంపిణీ, ప్రజలకు అవగాహన కల్పించడం.గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ అందుబాటులో లేకపోయినా, ప్రజలకు మొదటి సలహా ఇచ్చినవారే ఫార్మసిస్ట్‌లు.ఈ కృషి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.
భవిష్యత్ దిశ
• ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోంది. కొత్త వ్యాధులు వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మసిస్ట్ పాత్ర మరింత కీలకం.
భవిష్యత్‌లో:
• ఇప్పటికే డిజిటల్ ఫార్మసీ సేవలు (ఈ ఔషధీ) పెరిగాయి.డిజిటల్ ఫార్మసీ సేవలు పెరుగుతాయి.
• టెలి-ఫార్మసీ కౌన్సెలింగ్ ద్వారా గ్రామీణ ప్రజలకు సాయం.
• రీసెర్చ్, డ్రగ్ ఇన్నోవేషన్లో ఫార్మసిస్ట్‌ల పాత్ర పెరుగుతుంది.
• హెల్త్ పాలసీ రూపకల్పనలో కూడా ఫార్మసిస్ట్‌ల సహకారం అవసరం అవుతుంది.
ముగింపు
ప్రపంచ ఫార్మసిస్ట్ డే మనకు గుర్తు చేస్తున్నది ఒకే విషయం – ఆరోగ్యానికి ఫార్మసిస్ట్ అవిభాజ్య భాగస్వామి.
సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు వారు చూపుతున్న నిబద్ధతకు మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో “ఫార్మసీ ఆఫీసర్స్”గా గౌరవప్రదమైన గుర్తింపు పొందిన ప్రతి ఫార్మసిస్ట్‌కు మన హృదయపూర్వక అభినందనలు.
Tags
Continue Reading
వైద్య ఉద్యోగులందరికీ దసరా పండగ అడ్వాన్స్ ఇవ్వాలి
Arogyajyothi Daily
September 24, 2025
• టీ హబ్ రేడియాలజిస్ట్ అందరికీ కూడా పాత జీవో ప్రకారం జీతం ఇవ్వాలి.
• ఎన్ హెచ్ ఎం జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి
కొమురం భీం ఆసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి): పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని, ఎన్ హెచ్ ఎం అన్ని విభాగాల వారి మాదిరిగానే డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా పాత జీవో ప్రకారం పి ఆర్ సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయ సూపరిండెండెంట్ ఎండి షఫీ యుద్దీన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ లక్షల రూపాయల జీతం పొందే పర్మినెంట్ కార్మికులకు రూ. 25 వేల దసరా అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కనీసం రూపాయలు రూ.20 వేల దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పర్మినెంట్ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, వారికి రూ.50 వేలు చెల్లించాలని కూడా కోరుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమించి ఎన్ హెచ్ ఎం సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం తగదని పేర్కొన్నారు. వారికి కూడా పండుగ ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలని, వారికి కూడా రూపాయలు 20 వేల దసరా అడ్వాన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం స్కీము లో పనిచేస్తున్న వారందరితోపాటు డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా నూతన జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారము పిఆర్సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ కోశాధికారి సిహెచ్ నాగేష్, డి.పి.ఎం.యూనిట్. డిస్ట్రిక్ట్ అకౌంట్ ఆఫీసర్ ప్రవీణ్, సైకాలజిస్ట్ లీద్య, షకీల్, జీవిత మరియు తదితరులు పాల్గొన్నారు.
Tags
Continue Reading
రిమ్స్ నర్సింగ్ కళాశాలకి.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
Arogyajyothi Daily
September 24, 2025
అదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజ్ కి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చారు. బుధవారం రోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జై సింగ్, డైరెక్టర్ ఛాంబర్ లో జైన్ అయ్యారు. బన్సువాడ నర్సింగ్ కళాశాలలో ట్యూటర్లుగా ఉన్న ఆర్. శ్రీదేవి, పి.లక్ష్మి లకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. దీంతో బుధవారం రోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ కి జైనింగ్ కాపీ ఇచ్చారు. డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది అదిలాబాద్ నర్సింగ్ కళాశాలకు వచ్చినందుకు గాను పి లక్ష్మి, ఆర్ శ్రీదేవి లను ఘనంగా సన్మానించారు.
Tags
Continue Reading

