వైద్య ఉద్యోగులందరికీ దసరా పండగ అడ్వాన్స్ ఇవ్వాలి
• టీ హబ్ రేడియాలజిస్ట్ అందరికీ కూడా పాత జీవో ప్రకారం జీతం ఇవ్వాలి.
• ఎన్ హెచ్ ఎం జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి
కొమురం భీం ఆసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి): పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని, ఎన్ హెచ్ ఎం అన్ని విభాగాల వారి మాదిరిగానే డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా పాత జీవో ప్రకారం పి ఆర్ సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయ సూపరిండెండెంట్ ఎండి షఫీ యుద్దీన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ లక్షల రూపాయల జీతం పొందే పర్మినెంట్ కార్మికులకు రూ. 25 వేల దసరా అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కనీసం రూపాయలు రూ.20 వేల దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పర్మినెంట్ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, వారికి రూ.50 వేలు చెల్లించాలని కూడా కోరుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమించి ఎన్ హెచ్ ఎం సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం తగదని పేర్కొన్నారు. వారికి కూడా పండుగ ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలని, వారికి కూడా రూపాయలు 20 వేల దసరా అడ్వాన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం స్కీము లో పనిచేస్తున్న వారందరితోపాటు డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా నూతన జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారము పిఆర్సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ కోశాధికారి సిహెచ్ నాగేష్, డి.పి.ఎం.యూనిట్. డిస్ట్రిక్ట్ అకౌంట్ ఆఫీసర్ ప్రవీణ్, సైకాలజిస్ట్ లీద్య, షకీల్, జీవిత మరియు తదితరులు పాల్గొన్నారు.