Sports & Games

Breaking News

.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన మెగా శిబిరం

నాగర్ కర్నూల్, కల్వకుర్తి ,(ఆరోగ్య జ్యోతి):పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సుప్రభాతచేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరం లో 50 మంది రక్త దానం చేసారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ట్రస్ట్ ఫౌండర్ జూలూరి రమేష్ బాబు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గందరవి లో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈసారి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారని తెలిపారు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యం కానీ నీరసం కానీ ఉండడని తెలిపారు రక్తదానం పై అవగాహన కల్పించవలసిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండల రేవంత్,డి నితిన్, కోశాధికారి లు సంబు తరుణ్,పోల గిరిబాబు, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ  సంఘాల సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోలాటాలు, దాండియా తోపాటు మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు ఉంటాయి అని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.