సిద్దిక్ నగర్ లో..స్వశక్తి వైద్య శిబిరం
హైదరాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బస్ కమ్యూనిటీ బస్తీ దవఖాన సిద్ధిక్ నగర్ లో శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎస్పిహెచ్ఓ డాక్టర్ శ్రీధర్ సూరజ్ బాన్ క్లస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పక్కనపదిగా ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు ఇందులో భాగంగా హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కేన్సర్ అనుమానిత కేసులు మరియు ట్యూబర్‌కులోసిస్ స్క్రీనింగ్ చేసి, తగిన రిఫరల్స్ అందజేయడం.గర్భిణీ స్త్రీలకు అంథెనాటల్ చెకప్‌లు మరియు మాతృ ఆరోగ్య సేవలు.హెమోగ్లోబిన్ పరీక్షలు చేసి రక్తహీనతను గుర్తించి చికిత్స చేయడం.మాసికధర్మ పరిశుభ్రత, పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై కౌన్సిలింగ్.రక్తదానం సేవలపై అవగాహన మరియు ప్రోత్సాహం.సేవలను అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్రార్ ఉల్ హక్ షేక్, నర్సింగ్ ఆఫీసర్ వి.పద్మ, /\ఠాకూర్ దీప్మాల, సపోర్ట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు