ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సర అడ్మిషన్లు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో 78 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
» రెండో విడత ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్
» 2నుంచి తరగతులు
» ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్
ఖమ్మం,(ఆరోగ్యజ్యోతి):
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలు మొదలయ్యినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత జాతీయ కోటాలో 15సీట్లు భర్తీ కాగా స్టేట్ కోటాలో 63 సీట్లు మొత్తంగా ఇప్పటి వరకు 78 సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ సెప్టెం బరు 29 నుంచి మెదలవుతుంద నీ ప్రిన్సిపాల్ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 100 సీట్లకు గాను మొదటి విడతలోనే 78సీట్లు భర్తీకా వడం గమనార్హమన్నారు. అక్టోబరు 2 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన రెండో ఏడాది ఎంబీబీఎస్ ఫలితాల్లో ఖమ్మం మెడికల్ కళాశాల విద్యా ర్థులు మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. 96శాతం ఉత్తీర్ణులయ్యారని వీటిలో 46 మంది మెదటి శ్రేణిలో, 17 మంది విద్యార్థులు డిస్టెంక్షన్ ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మంచి విద్యతోపాటు అనుబంధ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. అనుభవం గల ఆధ్యాపకుల ను ప్రభుత్వ నియమించడం వల్ల కళాశాలలో మంచి విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యతోపాటు రోగులకు మంచి నాణ్యమైన వైద్య సేవలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నాం అని తెలిపారు.