నేడు రిమ్స్ గణపతి ఆలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
.ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఆవరణలో గల గణపతి ఆలయంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్ ,జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పరిధ, క్యాంప్ ఇంచార్జ్ డాక్టర్ అవినేష్ రాథోడ్, డాక్టర్ పి శ్రీకాంత్ డాక్టర్ ఎండి ఇక్రముద్దిన్ లు తెలిపారు. రిమ్స్ ఆవరణలో నిర్వహించే శిబిరం 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారూ తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య చికిత్సలు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు మహాగణపతి ఆలయం రిమ్స్ ఆసుపత్రి గేట్ వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ అధిక సంఖ్యలో ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేసుకొని మందులు తీసుకోగలరని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ లో హాజరవుతున్నట్టు తెలిపారు.