Sports & Games

Breaking News

ఊరు రా వైద్య శిబిరాలు

భీంపూర్ పిహెచ్సి పరిధిలో వైద్య శిబిరాలు 
బీంపూర్,(ఆరోగ్యజ్యోతి):
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ పరిధిలోని గుంజాల,రాజుల్వాడి,వడూర్,లీముగూడ, బెల్స రాంపూర్,బుర్కపల్లి  గ్రామాలలో వైద్యారోగ్య అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసి, 184 ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు జ్వరంతో బాధపడుతున్న 14 ప్రజలకు రక్తపూతలను సేకరించడం,1 నీళ్ళు విరేచనాలు వారికి మందులను అందించడంతో పాటు సీజనల్ వ్యాధులైన జలుబు,సర్ది, దగ్గు, జ్వరాలు మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, మెదడువాపు, ఫైలేరియా,దగ్గు, నీళ్ళ విరేచనాలు, పచ్చకామెర్లు, టైఫాయిడ్ బారిన పడకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,ఇండ్లను సందర్శించి ర్యాపిడ్ ఫీవర్ సర్వే, మంగళవారం డ్రైడేకార్యక్రమం, ఆంటి లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం,టెలిమానస్ కాల్స్ చేయించడం,క్షయ వ్యాధితో బాధపడుతున్న వారి క్షేమ సమాచారం, మందులను వాడుచున్నార లేదా, పోషకాహారం తీసుకోవాల్సిందిగా కోరడమైనదని  మండల వైద్యాధికారి డా "టి.నిఖిల్ రాజ్,మండల విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ తెలిపారు, ఈకార్యక్రమంలో జన్మన్ క్యాంపు డా"చరిత్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రూహిదాస్, మేఘ, ఆరోగ్య కార్యకర్తలు సరస్వతి, లచ్చుబాయ్, సుజాత, విజయలక్ష్మి, భాగ్యవతి,జానాబాయ్, యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, మాయావతి, సాహితి,జన్మన్ సిబ్బంది ప్రయోగ శాల నిపుణులు సుమతి, అసిస్టెంట్ సాయికుమార్, సంబంధిత గ్రామాల, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు,  ఆశా కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు