Sports & Games

Breaking News

ఎం జి ఎం పి పి యూనిట్ని ఆకస్మికంగా అతనికి చేసిన డిఎం అండ్ హెచ్ ఓ


వరంగల్,(ఆరోగ్య జ్యోతి):వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్  ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ పీ.పీ.యూనిట్ ను పరిశీలించిన వరంగల్ డీ. ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.బీ. సాంబశివరావు..ఈ సందర్భంగా  డి.ఎం.అండ్.హెచ్.ఓ. సాంబశివరావు మాట్లాడుతూ.. పేద  ప్రజలకు అందుబాటులో  ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని సిబ్బందిని   కోరారు. ముఖ్యంగా పట్టణంలో పర్యటించినప్పుడు  పరిసర ప్రాంతాలను పరిశీలించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలి, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎం.జీ.ఎం. పీ.పీ. యూనిట్ వైద్యాధికారి  డాక్టర్.ఏం.యశస్విని, సూపర్వైజర్ నర్మద , రామ రాజేష్ ఖన్నా  తదితరులు పాల్గొన్నారు.