Sports & Games

Breaking News

భీంపూర్ పిహెచ్సిలో సుఖ ప్రసవాలు

.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు సురక్షిత కాన్పులు 
భీంపూర్, (ఆరోగ్యజ్యోతి): భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రోజు మూడు నార్మల్ డెలివరులను చేయడం జరిగిందని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ టీ నిఖిల్ రాజ్ తెలిపారు. భీంపూర్ మండలం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోనెవడోర్ గుంజాల గ్రామాలకు చెందిన గర్భిణీలు ప్రసూతి నిమిత్తం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడంతో వారికి సురక్షితంగా నార్మల్ డెలివరీలను చేయడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు కాన్పులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయినట్లయితే తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కాన్పు రైన మహిళలు పుట్టిన పిల్లలు సురక్షన్ గా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, నర్సింగ్ ఆఫీసర్ పూర్ణిమ, పర్యవేక్షకులు మేఘ, ఆశా కార్యకర్తలు పద్మ ,రమా, సంతోషిని ఆయా రేఖ ,శంకర్ తదితరులు ఉన్నారు.