Sports & Games

Breaking News

గిరిజన విద్యార్థినిలకు రక్తదానం


హెల్ప్ డిస్క్ ఆద్వర్యంలో గిరిజన మహిళలకు రక్తదానం 
ఆదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో గల హెల్ప్ డిస్క్ లైసన్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళలకు రక్తం అవసరం ఉన్నందున రిమ్స్ బ్లడ్ బ్యాంకులో అందుబాటులో లేని కారణంగా ఇద్దరు యువకులు లైసెన్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో రక్తదానం చేయించారు. వివరాలకు వెళితే మోడల్ స్కూల్ సిర్పూర్ లో 10వ తరగతి చదువుతున్న మేస్త్రి మహేశ్వరికి హిమోగ్లోబిన్ 4.5 గ్రాములు ఉండడంతో ఆమెకు అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉంది అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న మరప విజయలక్ష్మికి 4.4 గ్రాముల ఇమోబులోను ఉండటం వల్ల ఆమెకు రక్తం అవసరం ఉన్నందున రిమ్స్ బ్లడ్ బ్యాంకులో రక్తం లేకపోవడంతో లైసెన్ అధికారి సత్యనారాయణ ఇద్దరు యువకులను రక్తదానం చేసేందుకు పిలిచి రక్తదానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేస్త్రి మహేశ్వరి మరొక విజయలక్ష్మి లకు అవసరం ఉన్న రక్తం రిమ్స్ బ్లడ్ బ్యాంకులో లేని కారణంగా బయట వ్యక్తులను పిలిపించి రక్తం దానం చేయించడం జరిగిందని తెలిపారు. ఇద్దరు మహిళలకు నాలుగు నుంచి ఐదు గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటం వల్ల అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉన్నందున రక్తదాతలు అందుబాటు లేకపోవడంతో ఇద్దరు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఆ యువకులకు ధన్యవాదాలు తెలిపారు.