గోపాల్ పూర్ లో ఉచిత వైద్య శిబిరం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
గోపాల్పూర్ లో వైద్య శిబిరం
ఇంద్రవెల్లి, (ఆరోగ్యజ్యోతి): పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోపాల్పూర్ గూడ గోపాల్పూర్ తండాలో శనివారం రోజు నల్గొండ సబ్ సెంటర్ పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నల్గొండ సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త విజయసుందరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం వ్యాధినిరోధక కార్యక్రమాలు ఎన్సిడి శిబిరం వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం తో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె వివరించారు ఇందులో భాగంగా విహెచ్ఎండి సమావేశం డ్రై డే కార్యక్రమం ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించడం జరిగినట్లు ఆమె వివరించారు. వర్షాకాలం కావడం వల్ల వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిశుభ్రత పాటించడంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని గ్రామస్తులకు వివరించారు. డెంగ్యూ మలేరియా అతిసారా పచ్చకామెర్ల లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి ప్రియంక, ఆశా కార్యకర్త జీజాబాయి తదితరులు ఉన్నారు.