మూడు కిలోమీటర్ల దూరం నడిచి వైద్య సేవలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మూడు కిలోమీటర్లు కాలినడకన నడిచి..
ఇమ్యునైజేషన్ కార్యక్రమం
బజారత్నూర్ ,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా.. రోడ్డు సౌకర్యం లేక వాహనాలు వెళ్ళక కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి... అసలే వర్షాకాలం ఆపై ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు.. అలాంటి సమయంలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ జిల్లా లోని బజారత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఎంఎల్ హెచ్పి దివ్యవాణి ఆరోగ్య కార్యకర్త విజయ ఆశా కార్యకర్త పంచశీలలు రోడ్డు సౌకర్యం లేకుండా కాలినడకన మూడు కిలోమీటర్లు ప్రయాణించి చిన్మయిక్ తాండ లో రొటీన్ ఇమిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఈ మునైజేషన్ కార్యక్రమం తో పాటు వైద్య శిబిరం వర్షాకాలం వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భీమ్ రావు ఆరోగ్య జ్యోతి తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పనిచేయడంలో ముందు ఉంటారని తెలిపారు. విధులు బాధ్యతల అన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చాలా వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు సక్రమంగా లేవని అనుబంధ గ్రామాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు అయినప్పటికీ ఆరోగ్య సిబ్బంది ఎలాగైనా అక్కడ చేరుకొని రోగులకు సేవలందిస్తారని తెలిపారు.