వాగు దాటుతూ వైద్య సేవలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఇదేం డ్యూటీ బాబు...
ప్రాణాలకు తెగించి విధులు..
ఆదిలాబాద్ జిల్లాలో ఎటుచూసినా కాలినడక నే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధులు
ఇదేం విధులు బాబాయ్...
ఆదిలాబాద్ బ్యూరో (ఆరోగ్యజ్యోతి):
ప్రాణాలకు తెగించి సేవలు చేస్తారా... వాగు దాటే సమయంలో వరద వస్తే పరిస్థితి ఏంటి... అనుకుంటున్నారా ఇది నిజమే.. ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కాలినడకన డ్యూటీలోకి వెళ్లడం బురదలో నడుచుకుంటూ మూడు నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్లి వైద్య సేవలు అందించడం కొత్తేమీ కాదు.. ఫోటోలో చూస్తున్నట్టు మీరు చూస్తున్నది నిజమే వాగు దాటుతూ వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది ఉన్నారు.. ఇంత భయంకరమైన ఫోటోలో ఎలా దాటుతున్నారు మనం చూస్తే మన శరీరం గుళ్ళు కొడుతుంది.. ఇది ఎక్కడిది అంటారా పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వలగొండ గ్రామపంచాయతీ పరిధిలో గల అర్కాపూర్ గ్రామానికి ఆరోగ్య కార్యకర్త కే విజయ సుందరి ఆశాకరియకర్త కె మైనా బాయిలు భయంకరమైన వాగుదాటుతూ విధి నిర్వహణకు వెళ్తున్నారు. మార్కాపూర్ గ్రామంలో బుధవారం రోజు యువనైజేషన్ కార్యక్రమంలో భాగంగా మామిడి కూడా లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గత సంవత్సరం వేరు అంటే ఆరోగ్య కార్యకర్త విజయ సుందరి ఆశా కార్యకర్తలు ఇలాగే ఉప్పొంగే వాగులో దాటుతూ వైద్య సేవలు అందించారు ఆ సమయంలో వీరు జిల్లా కలెక్టర్ చేతుల మీద అవార్డు పొందారు.