Sports & Games

Breaking News

ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఆరోగ్య పాఠశాలను విజయవంతం చేయండి 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని  పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా వైద్యంలో ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ఆర్.బి.ఎస్.కె బృందాలతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అమలవుతున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమం లో సకాలంలో హాజరై కార్యక్రమాన్ని మీ అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య పాఠశాల లో భాగంగా పాఠశాల సందర్శించిన సమయంలో పిల్లలకు అందించే పోషక ఆహారం పరిసరాల పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్మల నిర్వహణ లో పరిశీలించాలని తెలిపారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు ఏమాత్రం విద్యార్థులచే నిర్మించాలని తెలిపారు.