కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కస్తూర్బా బాలిక ల రెసిడెన్షియల్ కళాశాలలో కీటక జనిత కార్యక్రమం
భీంపూర్, (ఆరోగ్యజ్యోతి): బీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కస్తూర్బా బాలిక రెసిడెన్షియల్ కళాశాలలో జాతీయ కీటక జనత కార్యక్రమం లో భాగంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల వృద్ధి మలేరియా డెంగ్యూ వ్యాధి నిరోధక టీకాలు తోపాటు తదితర ఆరోగ్య కార్యక్రమాలపై అవగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత లేకపోవడం నీటి విలువలు ఉండడం వల్ల అక్కడ దోమలు ఉంటాయని దోమలను పరదోలేందుకు కియోపాస్ మందు పిచికారి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రసాయన పిచికారి వల్ల దోమల లార్వా కీటకాలు పెరగకుండా వృద్ధి చెందకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీ నిఖిల్ రాజ్ మండల పంచాయతీ అధికారి సమీర్ ఖాన్ మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ కళాశాల ఆరోగ్య కార్యకర్త మనోజ ఆరోగ్య కార్యకర్తలు జానాబాయి ఆశా కార్యకర్త భారతి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.