ఘనంగా బోనాలు అలై బలై జాతర మహోత్సవాలు
Editor K. Naresh Kumar 9848025451
తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయ పాల్ రెడ్డి
అమెరికా వ్యాప్తంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటి) ఆధ్వర్యంలో ఆశాఢం మాసం సందర్భంగా బోనాల తోపాటు- అలై బలై జాతర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ బోనాలు మరియు అలైబలై కార్యక్రమాన్ని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ బోనాలు అలైబలై సంస్కృతిక మహోత్సవాలను టిటిఏ చైర్మన్ డాక్టర్.విజయపాల్ రెడ్డి, టిటిఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, టిటిఏ బృందం, సభ్యులంతా సమన్వయంతో స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించడం అభినందనీయమని టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్. పైల్ల మల్లా రెడ్డి హిమాయత్నగర్ లో తెలిపారు. న్యూయార్క్,ఇండియానాపోలిస్, షార్లెట్, న్యూజెర్సీ, అట్లాంటా, సియాటిల్, డల్లాస్, ఫిలడెల్ఫియా, పోర్ట్ ల్యాండ్ వంటి పలు రాష్ట్రాల్లో బోనాలు మరియు అలైబలై కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అన్ని దేశాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బోనాల పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పుతున్న ఘనత మన తెలంగాణ దేనని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బోనాలు అలైబలై కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ప్రతిబింబించా అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని ప్రతి రాష్టంలో బోనాలు అలై బలై జాతర కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయన్నారు. టిటిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,బోనాలూ అడ్వైజర్ కవితా రెడ్డి, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా, నర్సింహ పెరుక, వెబ్ కమిటీ చైర్ నరేంద్ర రెడ్డి యారవ, మీడియా డైరెక్టర్ దీపికా రెడ్డి నల్లాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ప్రతి తెలంగాణవాసి, తెలుగువాళ్ళంతా గర్వించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం అన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ పండగలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ఘనత మన తెలంగాణ ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం తెలుగు పండగలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నారని తెలిపారు. తెలుగు పండుగలు అంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా సాంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శిస్తూ ప్రతి ఒక్క దేశంలో పరిచయం చేస్తున్న మన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు పండగలు రాగానే విదేశీయులందరూ సాంస్కృతి సాంప్రదాయంగా చేస్తున్న పండగలు ను కన్నుల పండుగగా తిలకిస్తున్నారని తెలిపారు.