క్షయ నిర్ధారణ వైద్య శిబిరం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కుర్చీద్ నగర్ లో క్షయ వైద్య శిబిరం
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుర్సీద్ నగర్ లో క్షయ వ్యాధి శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత మాట్లాడుతూ టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. టీవీ వచ్చిందని భయపడవలసిన అవసరం లేదని వైద్యులు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ సక్రమంగా మందులు వాడినట్లయితే వ్యాధి తగ్గుముఖం పడుతుందని తెలిపారు. ఈ శిబిరంలో భాగంగా 75 మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ నహీద్ అన్సారి, ల్యాబ్ టెక్నీషియన్ అరుణ్ కుమార్, నాగభూషణం, సి ఓ ప్రశాంత్ డేస్ పాండే ,ఆరోగ్య కార్యకర్తలు పుష్పలత, మమత, ప్రభ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.