Sports & Games

Breaking News

రిమ్స్ లో లిఫ్ట్ ప్రారంభించిన డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 
అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ సౌకర్యాన్ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ సోమవారం రోజు ప్రారంభించారు. రిమ్స్ లిఫ్టులో ప్రారంభత్సవ కార్యక్రమంలో రిమ్స్ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ దీపక్ పుష్కర్, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నరేందర్ బండారి, రిమ్స్ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సాయి, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి, సిమ్మి కుమారి, అశ్విన్ కుమార్, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింహాతో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి మూడు ఫ్లోర్లు ఉన్నందున రోగులను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లిఫ్ట్ గత కొంతకాలంగా కొన్ని వస్తువులు దొరకపోవడం వల్ల మరమ్మత్తులు చేయించలేదని తెలిపారు. రోగులను దృష్టిలో ఉంచుకొని రీమ్స్ జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రిమ్స్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయడం వల్ల రోగులకు చాలావరకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.