తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిమ్స్ డైరెక్టర్ డిప్యూటీ సూపరిండెంట్లకు సన్మానం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ దీపక్ పుష్కర్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నరేందర్ బండారి లను తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ ప్రధాన కార్యదర్శి రఘురాం ల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ లు డాక్టర్ దీపక్ పుష్కర్, డాక్టర్ నరేందర్ బండారి లు మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు అన్ని రకాల వైద్య సేవలు అందించం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రత్యేకత ఆస్పత్రి అని రోగులు ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వస్తున్నారని ఆసుపత్రికి వచ్చిన రోగులకు వ్యాధులు నయమై ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తున్నారని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్య సేవలు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చాలా రకాల స్పెషలిస్ట్ వైద్యులు ఆపరేషన్లు చేసే రికార్డ్స్ సాధించారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
రమణాచారి, శ్రీకాంత్, ప్రమోద్, దయాకర్, అరుణ్, నావిద్ మోసిన్ , సచిన్, హరీష్, వివేక్, ప్రవీణ్, బుర్ర సంతోష్, రవికుమార్, రిమ్స్ లీడర్స్ అనిల్ కుమార్, నాగేష్, సూపర్ స్పెషాలిటీ నాయకులు ప్రకాష్, శ్రీనివాస్, అక్షయ్, పాతలోజి, బయో కెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వినయ్, శ్రీనివాస్, అరుణ్, విజయ్ కుమార్, జాకీర్, కృష్ణ, రాజీవ్, సమీర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.