పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం ముందుండాలి
సమయపాలన పాటించి సరిగా విధులకు హాజరు కావాలి
విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా వైద్యములు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
అదిలాబాద్ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): ఆసుపత్రికి వచ్చే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్యసే వర్ణించడంలో సిబ్బంది ముందు ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శనివారం నాడు నార్నూర్ , శ్యామ్ పూర్, ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. రోగులకు సేవలు అందించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముందు ఉండాలని తెలిపారు. విధులు విస్మరిస్తే విధులకు గైరజరైనట్లు ఫిర్యాదులు వస్తే శాఖా పరమైన చర్యలు ఉద్యోగులపై తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో సిబ్బంది ఆదర్శ రిజిస్టర్ సేవల నాణ్యత రిజిస్టర్ మందులు ఓపి విభాగం సేవలు తదితర వాటిని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.గర్భిణీల కొరకు వాహన వినియోగం నిత్య కార్యచరణ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొన్నారు. ఎన్సీడీ సేవలు, హై రిస్క్, ఏ.ఎన్.సి గుర్తింపు టీబీ నిర్ధారణ టీకాల కార్యక్రమం పిఎం జన్మాన్ మాతా శిశు సంరక్షణ సేవలు తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు. టెలి మెడిసన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గైర్హాజరైన సిబ్బందికి మెమోలు జారీ చేశారు.