Sports & Games

Breaking News

ఆరోగ్య కార్యకర్తల ఫలితాలు ఎప్పుడో?..

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848 025451 

- ఫలితాలపురపు ఎదురుచూపులు 
- ఆరు నెలల నుంచి ఫలితాల కోసం చూపు 
- ఈనెల 29న విడుదల కరెక్టేనా?..
- పోస్టులు పెంచితే ఉద్యోగాలు కొందరికి గ్యారెంటీ?
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులకు కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 డిసెంబర్ 2024న అర్హత పరీక్ష నిర్వహించింది.. ఆరోగ్య కార్యకర్తలు డిసెంబర్ 29న పరీక్షలు రాశారు. ఫలితాలు రాక ఈరోజు.. రేపు..వస్తాయో  పలితాలని వేయికళ్లతో ఆరోగ్య కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వస్తే ఉద్యోగాలు వస్తాయని గంపేడు ఆశతో ఎదురుచూస్తున్న ప్రభుత్వం మాత్రం ఫలితాలను ఇంతవరకు విడుదల చేయలేదు. ఫలితాలు వస్తే 1500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులు వస్తాయా నే ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 1500 చిల్లర పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది.కానీ ప్రస్తుత ప్రభుత్వం పోస్టర్ను పెంచినట్లయితే చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫలితాలు ఇంతవరకు రాలేదు. ఈనెల 29న ఫలితాలు వస్తాయని ఆ నోట ఈ నోట వస్తున్న వార్తలు కరెక్టేనా?.. ప్రభుత్వం ఈనెల 29న ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల చేస్తుందా?. అనే వార్తలు వాస్తవమేనా?.. ఏదిఏమైనాప్పటికీ ఫలితాలు వస్తే ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే ఆరోగ్య కార్యకర్తల ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారు...